మహేష్ బాబు స్పైడర్ అప్ డేట్స్

Thursday,May 11,2017 - 12:16 by Z_CLU

మొన్నటి వరకు ‘స్పైడర్’ సీన్స్ ని తెరకెక్కించే పనిలో ఉన్న సినిమా యూనిట్, సక్సెస్ ఫుల్ గా ఆ షెడ్యూల్ కి ప్యాకప్ చెప్పేసింది. హై ఎండ్ హీట్ సీజన్ లో బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ తో బిజీబిజీగా గడిపిన మహేష్ బాబు, ఈ షెడ్యూల్ తరవాత హాలీడే ప్రకటించేశాడు. ప్రస్తుతం ఫ్యామిలీతో గోవాలో హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ హాలీడే తరవాతే మళ్ళీ సెట్స్ పైకి వస్తాడు సూపర్ స్టార్. ఈ షెడ్యూల్ లో ఒక సాంగ్ తెరకెక్కిస్తే ఇక మ్యాగ్జిమం సినిమా కంప్లీట్ అయిపోయినట్టే.

AR మురుగదాస్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాతో కోలీవుడ్ లోను ఎంట్రీ ఇవ్వబోతున్నాడు మహేష్ బాబు. ఇంటలిజెన్స్ ఆఫీసర్ గా పవర్ ఫుల్ క్యారెక్టర్ లో నటిస్తున్న మహేష్ బాబు ఈ సినిమాకి ప్యాకప్ చెప్పీ చెప్పగానే మే 18 నుండి కొరటాల డైరెక్షన్ లో ‘భరత్ అనే నేను’ సినిమా సెట్స్ పై ఉంటాడు.