అరబిక్ లో మహేష్ బాబు స్పైడర్

Tuesday,August 22,2017 - 01:32 by Z_CLU

మహేష్ బాబు స్పైడర్ సెప్టెంబర్ 27 న రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ సినిమాతో కోలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్న ఈ సినిమాపై భారీ ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. అయితే హై ఎండ్ టెక్నికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని గల్ఫ్ కంట్రీస్ లోను రిలీజ్ చేసే ఆలోచనలో ఉంది.

బిగినింగ్ నుండే తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో రిలీజ్ కి ఫిక్స్ అయిన ఈ సినిమా ఈ మూడు భాషలతో పాటు అరబిక్ వర్షన్ కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా అప్పుడే బిగిన్ చేసేసింది ‘స్పైడర్’ టీమ్. గల్ఫ్ కంట్రీస్ లోను సెప్టెంబర్ 27 నే ఈ సినిమాను రిలీజ్ చేయనుంది. దీనికి సబంధించిన బిజినెస్ పనులు స్పీడ్ అందుకుంటున్నట్టు తెలుస్తుంది.

A.R. మురుగదాస్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని ఠాగూర్ మధుతో పాటు NV ప్రసాద్ కలిసి నిర్మిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్హీరోయిన్, హారిస్ జయరాజ్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.