ఎప్పటికి మరిచిపోలేని ఒక స్పెషల్ మూమెంట్ - మహేష్ బాబు

Friday,September 02,2022 - 06:50 by Z_CLU

ఎన్నో అద్భుతమైన రియాలిటీ షోస్ తో ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న జీ తెలుగు, ఇటీవలే డాన్స్ ఇండియా డాన్స్ – తెలుగు మొదటి సీసన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. రెండు బ్లాక్ బస్టర్ లాంచ్ ఎపిసోడ్స్ ద్వారా 10 కంటెస్టెంట్ జోడీలను వీక్షకులకు పరిచయం చేసిన ఛానల్, ఇప్పుడు కాంపిటీషన్ ఫేస్ ను మునుపెన్నడూలేని విధంగా ప్రారంభించనుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు కాంపిటీషన్ ఫేస్ ను ‘ఫ్లాగ్ ఆఫ్’ చేయబోతుండగా, తన కూతురు సితారతో కలిసి మొదటిసారి ఒక రియాలిటీ షో లో కనిపించనున్నారు. కంటెస్టెంట్స్ యొక్క మైమరపించే ప్రదర్శనలతో పాటు మహేష్-సితారలు యాంకర్స్ మరియు జడ్జెస్ తో చేసే సందడి చూడాలంటే, సెప్టెంబర్ 4న (ఆదివారం) రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే డాన్స్ ఇండియా డాన్స్ ఎపిసోడ్ ని చూడాల్సిందే.

మహేష్ బాబు తనదైన కామెడీ టైమింగ్ తో అలరించబోతుండగా, సితార వాళ్ళ నాన్నతో చేసే అల్లరి ఎపిసోడ్ కే హైలైట్ గా నిలవనుంది. అంతేకాకుండా, తన ముద్దు ముద్దు మాటలతో మరియు చక్కని డాన్స్ ప్రదర్శనతో సితార ఈ వారం ‘జీ తెలుగు’ ప్రేక్షకులను కనువిందు చేయనుంది.

కాంపిటీషన్ ఫేస్ ను ప్రారంభించిన అనంతరం మహేష్ బాబు మాట్లాడుతూ, “సితారకు డాన్స్ మీద ఉన్న మక్కువ నన్ను ఈ షో కి వచ్చేలా చేసింది. అంతేకాకుండా, మొదటిసారి నా కూతురితో కలిసి ఒక టీవీ షో లో కనిపించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇది ఎప్పటికి మరిచిపోలేని ఒక స్పెషల్ మూమెంట్. ఎన్నో భాషలలో సూపర్ హిట్ గా నిలిచిన డాన్స్ ఇండియా డాన్స్ ఇప్పుడు తెలుగులో రావడం మరియు ‘జీ తెలుగు’ మారుమూల గ్రామాల నుండి టాలెంట్ ని వెలుగులోకి తేవడం అభినందనీయం. ఈ షో లో పాల్గొంటున్న ప్రతిభావంతులైన పోటీదారులందరూ ఈ అవకాశాన్నిసద్వినియోగం చేసుకుంటూ తమ కళలను నెరవేర్చుకునే దిశగా అడుగులు వేస్తారని ఆశిస్తున్నాను. ఆదేవిందంగా, ఈ షో కి తమను ఆహ్వానించిన ‘జీ తెలుగు’ కి ప్రత్యేక ధన్యవాదాలు,” అని చెప్పారు.

ఈ ఆదివారం (సెప్టెంబర్ 4) మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమవుతున్న వినాయక చవితి స్పెషల్ ఈవెంట్ ‘మన ఊరి రంగస్థలం’ మరియు రాత్రి 9 గంటలకు ప్రసారమవుతున్న డాన్స్ ఇండియా డాన్స్ – తెలుగు కార్యక్రమాన్ని తప్పక వీక్షించండి, మీ జీ తెలుగు లో…

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics