'మహర్షి' కి మహేష్ సెంటిమెంట్

Friday,January 18,2019 - 11:03 by Z_CLU

టాలీవుడ్ స్టార్ హీరోల్లో కొందరు తమకి ఎలాంటి సెంటిమెంట్స్ లేవంటూనే కొన్ని సెంటిమెంట్లను ఫాలో అవుతుంటారు. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ ని కూడా ఓ సెంటిమెంట్ వెంటాడుతుంది. ఇంతకీ మహేష్ కి సెంటిమెంట్ ఏంటో తెలుసా.. ‘ఏప్రిల్ నెల’. అవును మహేష్ నటించిన కొన్ని సినిమాలు ఏప్రిల్ లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్స్ సాదించాయి. మహేష్ బాబు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ‘పోకిరి’ తో పాటు లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘భరత్ అనే నేను’ కూడా ఏప్రిల్ లోనే విడుదలయ్యాయి. ఇప్పుడు అదే సెంటిమెంట్ తో ఏప్రిల్ లోనే మహర్షి ని రిలీజ్ చేస్తున్నారు.

ఇప్పటికే సినిమాను ఏప్రిల్ 5 న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించిన మేకర్స్ లేటెస్ట్ గా ఏప్రిల్ 26 కి పోస్ట్ పోన్ చేసుకున్నారని సమాచారం. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఏప్రిల్ నెలను మాత్రం మిస్ అవ్వకుండా జాగ్రత్త పడుతున్నారని తెలుస్తోంది. మరి మహేష్ బ్లాక్ బస్టర్ హిట్స్ లోకి మహర్షి కూడా చేరితే ఇక ప్రతీ ఏడాది ఏప్రిల్ లో మహేష్ సినిమా రిలీజవ్వడం ఖాయమనిపిస్తోంది.