'సరిలేరు నీకెవ్వరు... అలా ఎలా..?

Saturday,June 01,2019 - 12:03 by Z_CLU

మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ చేసినప్పుడే కామెడీ ఎంటర్ టైనర్ అన్నారు… అందునా అనిల్ రావిపూడి ‘F2’ తరవాత చేస్తున్న సినిమా కాబట్టి అదిరిపోయే కామెడీ గ్యారంటీ ఫిక్సయిపోయారంతా… కానీ రిలీజైన టైటిల్ పోస్టరే ఆలోచనలో పడేస్తుంది.

సినిమాలో ఆర్మీ మేజర్ లా నటించనున్నాడు మహేష్ బాబు. ఈ విషయం ఫిలిమ్ మేకర్స్ అఫీషియల్ గానే అనౌన్స్ చేశారు. మరి ఆర్మీకి.. కామెడీకి కుదిరేలా..? క్యారెక్టర్ ఆర్మీ ఆఫీసర్ అయితే సినిమాలో కాన్ఫ్లిక్ట్ బార్డర్ రిలేటెడ్ అయినా ఉంటుంది. లేకపోతే సోల్జర్ ఆటిట్యూడ్ తో ఉన్న హీరో, సొసైటీలో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం లాంటిదేదో ఉండాలి… ఇవి రెండూ కాకుండా ఇంకేం ఉండబోతుంది ఈ సినిమాలో…

‘F2’ టైటిల్ అనౌన్స్ చేసినప్పుడే సినిమాలో కావాల్సినంత ఫన్ ఉండబోతుందని తెలిసిపోయింది. కానీ ఈ టైటిల్ పోస్టర్ మాత్రం మహేష్ బాబు స్థాయి యాక్షన్ కూడా ఎక్స్ పెక్ట్ చేయొచ్చనే సూచనలిచ్చేస్తుంది.

ఏది ఏమైనా అటు అనిల్ రావిపూడి, ఇటు మహేష్ బాబు ఏ మాత్రం దిజప్పాయింట్ చేయరనే కాన్ఫిడెన్స్ ఫ్యాన్స్ లో ఉంది. మరి అనిల్ రావిపూడి ఇంత ఆలోచన రేపుతున్న ‘సరిలేరు నీకెవ్వరు…’ సినిమాని ఎంత బాగా ప్రెజెంట్ చేస్తాడో చూడాలి.