‘సరిలేరు నీకెవ్వరు’ - క్యారెక్టర్ టీజర్ అదిరింది

Friday,August 09,2019 - 12:31 by Z_CLU

మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్  మెస్మరైజింగ్ ట్రీట్ ఇచ్చారు ‘సరిలేరు నీకెవ్వరు’ మేకర్స్. రీసెంట్ గా కాశ్మీర్ లో షూట్ చేసుకున్న ఆర్మీ బ్యాక్ డ్రాప్ సీక్వెన్సెస్ నుండి, మహేష్ బాబు లుక్స్ రివీల్ చేశారు. 44 సెకన్ల పాటు ఉన్న ఇంట్రడక్షన్ టీజర్ సినిమాలోని మహేష్ బాబు క్యారెక్టర్ పై అంచనాలను పెంచేస్తుంది.  దానికి తోడు DSP అందించిన టైటిల్ సాంగ్ BGM సింప్లీ సూపర్బ్.

మిలిటరీ యూనిఫామ్ లో స్టైలిష్ సైనికుడిలా కనిపిస్తున్న సూపర్ స్టార్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. మ్యాగ్జిమం కథ ఆర్మీ బ్యాక్ డ్రాప్ లోనే ఉన్నా, దర్శకుడు అనిల్ రావిపూడి తన మార్క్ కామెడీ తో ఈ సినిమాని ప్రెజెంట్ చేయబోతున్నాడు.

రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. సీనియర్ నటి విజయ శాంతి ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. బండ్ల గణేష్ మరో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. AK ఎంటర్ టైన్ మెంట్స్శ్రీ వెంకశ్వర క్రియేషన్స్, GMB ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై ఈ సినిమా తెరకెక్కుతుంది. 2020 లో సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది ఈ సినిమా.