12 ఏళ్ల ‘సైనికుడు’

Friday,November 30,2018 - 04:30 by Z_CLU

సరిగ్గా 12 ఏళ్ల క్రితం ఈ రోజే రిలీజయింది మహేష్ బాబు ‘సైనికుడు’. గుణశేఖర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా మహేష్ బాబు కరియర్ లో వెరీ స్పెషల్ గా నిలిచింది. పొలిటికల్ రియాలిటీస్ తో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం ఇప్పటికీ ఫ్రెష్ ఫీలింగ్ ని కలిగిస్తుంది.

గుణ శేఖర్ సినిమాలంటేనే భారీ సెట్స్. ఇంట్రెస్టింగ్ స్టోరీలైన్ తో విజువల్ ట్రీట్ గా సినిమాని ట్రాన్స్ ఫామ్ చేయడం గుణశేఖర్ స్పెషాలిటీ. ఈ సినిమాలోను చాలా ఇంట్రెస్టింగ్ సెట్స్ ప్లాన్ చేసుకున్నాడు గుణశేఖర్. ఇమోషనల్ సీక్వెన్సెస్ దగ్గరి నుండి యాక్షన్ ఎలిమెంట్స్ వరకు ప్రతి క్రాఫ్ట్ ని ఎక్స్ట్రా ఆర్డినరీ గా ప్రెజెంట్ చేశాడు గుణశేఖర్. అయితే దానితో పాటు ఈ సినిమాతో కలర్ గ్రేడింగ్ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేశాడు.

ఈ సినిమా షూటింగ్ కన్నా పోస్ట్ ప్రొడక్షన్ కే ఎక్కువ టైమ్ పట్టింది. హాలీవుడ్ టెక్నీషియన్ ‘ఉత్సి’ ఈ సినిమాకి పని చేయడం విశేషం. ARRIస్కాన్ టెక్నాలజీ తో ఈ సినిమాలోని ప్రతి సీన్ ని డిఫెరెంట్ షెడ్ లో ప్రెజెంట్ చేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు గుణశేఖర్.

సైనికుడు సినిమా గురించి ఎప్పుడు ప్రస్తావన వచ్చినా ఒక్కసారిగా గుర్తుకు వచ్చే ఎలిమెంట్ ఫ్లడ్స్ సీన్. సినిమా రిలీజైన కొత్తలో ఈ సీన్ స్క్రీన్ పై వస్తున్నంత సేపు ఆడిటోరియం కంప్లీట్ గా సైలెంట్ అయిపోయేది. దానికి తోడు సినిమాలో మహేష్ బాబు, త్రిష మధ్య ఉండే లవ్ ట్రాక్, రెగ్యులర్ సినిమాలతో పోలిస్తే కంప్లీట్ గా డిఫెరెంట్ అనిపిస్తుంది. హారిస్ జయరాజ్ కంపోజ్ చేసిన ఈ సినిమా సాంగ్స్, సినిమాకి బిగ్గెస్ట్ ఎసెట్.