Mahesh-Rajamouli - సినిమా ఇంకాస్త ఆలస్యం

Tuesday,May 11,2021 - 02:09 by Z_CLU

సూపర్ స్టార్ మహేష్ బాబు – స్టార్ డైరక్టర్ రాజమౌళి కాంబో సినిమా గురించి సినిమా లవర్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొన్నేళ్ళుగా ఈ ప్రాజెక్ట్ చర్చల్లో ఉంది. గతేడాది మహేష్ తో సినిమా ఉంటుందని ఇద్దరం కలిసి త్వరలోనే చేస్తామని చెప్పాడు రాజమౌళి. జక్కన్న అప్డేట్ ఇచ్చేసరికి ‘RRR’ తర్వాత రాజమౌళి సినిమా మహేష్ తోనే ఉంటుందని అందరూ అనుకున్నారు. ఇక రాజమౌళి కూడా అలాగే చెప్పాడు. దీంతో మహేష్ ‘సర్కారు వారి పాట’ తర్వాత రాజమౌళి సినిమాకు డేట్స్ ఇస్తాడని అందరూ అనుకున్నారు.

అయితే ఇప్పుడు ఈ కాంబో సినిమా మరింత ఆలస్యం అవ్వనుందని టాక్. రాజమౌళి RRR ఇంకా షూటింగ్ స్టేజిలో ఉంది. రిలీజ్ డేట్ పై ఎలాంటి క్లారిటీ లేదు. ఇక మహేష్ సర్కారు వారి పాట సినిమా పూర్తి చేసి నెక్స్ట్ త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఆ సినిమా తర్వాత అనిల్ రావిపూడితో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు. అలాగే మరికొన్ని కథలు విని లైన్లో పెట్టాడు. అంటే మహేష్ ఇప్పుడే ఫ్రీ అవ్వడు.

ఇక రాజమౌళి కూడా RRR తర్వాత కొంచెం బ్రేక్ తీసుకొని నెక్స్ట్ సినిమాకు తండ్రితో కలిసి కథ రెడీ చేయాలి. దానికి టైం పడుతుంది. మరి ఈ లోపు మహేష్ కమిట్ అయిన ప్రాజెక్ట్స్ ఫినిష్ చేస్తాడని అంటున్నారు. ఏదేమైనా కొన్నేళ్ళుగా నానుతున్న ఈ కాంబోలో సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా ? అని అటు మహేష్ ఫ్యాన్స్ ఇటు సినిమా లవర్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ కాంబో సినిమాపై క్లారిటీ రావాలంటే Rajamouli RRR రిలీజై ఆ తర్వాత ఎనౌన్స్ మెంట్ ఇవ్వాల్సిందే. అప్పటివరకు ఈ కాంబో సినిమా ప్రచారంలోనే ఉంటుంది.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics