కొరటాల సినిమాలో NRIగా మహేష్

Friday,March 17,2017 - 11:07 by Z_CLU

మహేష్-కొరటాల సినిమాకు సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులన్నీ ఒక్కొక్కటిగా పూర్తవుతున్నాయి. ఈ మూవీకి సంబంధించి మ్యూజిక్ సిట్టింగ్స్ ఇప్పటికే ప్రారంభం కాగా… స్క్రీన్ ప్లే వర్క్ దాదాపు పూర్తిచేశాడు కొరటాల. మరోవైపు ఈ సినిమాలో మహేష్ పాత్ర ఏంటనే విషయంపై కూడా చిన్న గాసిప్ స్టార్ట్ అయింది. ఈ మూవీలో మహేష్.. లండన్ రిటర్న్ ఎన్నారైగా కనిపిస్తాడట. కథకు తగ్గట్టు లండన్ లో ఓ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారట.

తాజా సమాచారం ప్రకారం… ఏప్రిల్ నెలాఖరు నుంచి మహేష్-కొరటాల సినిమా స్టార్ట్ అయ్యే అవకాశాలున్నాయి. ఈ మూవీకి సంబంధించి దేవిశ్రీప్రసాద్ ఇప్పటికే కంపోజింగ్ వర్క్ స్టార్ట్ చేశాడు. కొరటాల కొన్ని ట్యూన్స్ కు  ఓకే కూడా చెప్పాడట. ఈ సినిమాకు భరత్ అను నేను అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.

ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు మహేష్. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఎనౌన్స్ చేయలేేదు. మురుగదాస్ సినిమా టైటిల్ ఎనౌన్స్ మెంట్ పూర్తయిన వెంటనే, కొరటాల-మహేష్ సినిమా టైటిల్ ను కూడా అఫీషియల్ గాా ఎనౌన్స్ చేస్తారు.