న్యూఇయర్ కి సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్న మహేష్ బాబు

Wednesday,December 06,2017 - 12:49 by Z_CLU

మహేష్ కొరటాల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘భరత్ అనే నేను’ బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్ తో పక్కా ప్లానింగ్ తో షూటింగ్ ప్రాసెస్ జరుపుకుంటుంది. మహేష్ బాబు చీఫ్ మినిస్టర్ గా నటిస్తున్న ఈ సినిమా 2018  సమ్మర్ రిలీజ్ కి రెడీ అవుతుంది. అయితే 2018 న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ సందర్భంగా ఫ్యాన్స్ కోసం సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తుంది సినిమా యూనిట్..

డిసెంబర్ 31 న లేదా జనవరి 1 న ఈ సర్ ప్రైజ్ తో ఇంప్రెస్ చేయనున్న కొరటాల టీమ్, ఫ్యాన్స్ లో హై వోల్టేజ్ జోష్ నింపబోతున్న ఆ సర్ ప్రైజ్ ఏమిటా అన్నది మాత్రం ఇంకా రివీల్ చేయలేదు.  కొరటాల స్టైల్ లో కాంటెంపరరీ మెసేజ్ తో పాటు మెస్మరైజింగ్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. DVV దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.