అక్టోబర్ 15 నుండి మహేష్ బాబు కొత్త షెడ్యూల్

Thursday,October 12,2017 - 01:26 by Z_CLU

మహేష్ బాబు, కొరటాల శివ నెక్స్ట్ షెడ్యూల్ ఈ నెల 15 నుండి బిగిన్ కానుంది. ప్రస్తుతం ఈ షెడ్యూల్ కి సంబంధించిన సెట్, మేకింగ్ ప్రాసెస్ లో ఉండటంతో చిన్న బ్రేక్ తీసుకున్న సినిమా యూనిట్, మరో 3 రోజుల తరవాత రెగ్యులర్ షూటింగ్ తో బిగిన్ చేయనుంది. స్పైడర్  మూవీ  తరవాత  ఇమ్మీడియట్  గా ఈ సినిమా సెట్స్  పైకి వచ్చిన మహేష్  బాబు, ఈ గ్యాప్ లో  కాస్త  రిలాక్స్  అయినా 15 నుండి మళ్ళీ బిజీ  కాబోతున్నాడు.

మహేష్ బాబు సరసన కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.  D.V.V. దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాని జనవరి 11, 2018 న రిలీజ్ చేసే ప్రాసెస్ లో ఉంది సినిమా యూనిట్.