UK లో మహేష్ బాబు సినిమా ట్రేలర్

Thursday,February 16,2017 - 10:59 by Z_CLU

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మహేష్ మురుగదాస్ సినిమా ట్రేలర్ UK లో డిజైన్ అవుతుంది. ఇప్పటి దాకా కనీసం టైటిల్ ఏం ఫిక్స్ అయ్యరో కూడా బయటపడకుండా, హై ఎండ్ సస్పెన్స్ మెయిన్ టైన్ చేస్తున్న  సినిమా యూనిట్, హాలీవుడ్ రేంజ్ ట్రేలర్ తో మెస్మరైజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.

30 నిడివితో ప్లాన్ చేస్తున్న ఈ ట్రేలర్ కోసం హై స్టాండర్డ్ VFX ని వాడుతున్న సినిమా యూనిట్, బడ్జెట్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కావడం లేదని తెలుస్తుంది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని ఠాగూర్ మధు, NV ప్రసాద్ జాయింట్ గా నిర్మిస్తున్నారు.

మహేష్ బాబు కరియర్ లో ఎక్స్ పెన్సివ్ వెంచర్ కాబోతున్న ఈ సినిమా అల్టిమేట్ యాక్షన్ థ్రిల్లర్ లా తెరకెక్కుతుంది. ఇంటలిజెన్స్ ఆఫీసర్ లా నటిస్తున్న మహేష్ బాబు ఈ సినిమాతో తమిళనాట కూడా కూడా తన మార్క్ ని రిజిస్టర్ చేయబోతున్నాడు.