మహేష్ బాబు సినిమా రిలీజ్ డేట్

Friday,February 24,2017 - 12:08 by Z_CLU

టైటిల్ ఇంకా అఫీషియల్ గా కన్ఫం చేయలేదు, ఫస్ట్ లుక్ రిలీజ్ చేయలేదు.. ఏకంగా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసి అనౌన్స్ చేసేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, మురుగదాస్ సినిమా జూన్ 23 నుండి థియేటర్స్ లో ఉంటుంది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఇంత సస్పెన్స్ లోను హై ఎండ్ ఎక్స్ పెక్టేషన్స్ ని క్రియేట్ చేసుకుంటుంది.

మురుగదాస్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా అటు తమిళం, తెలుగులోనూ ఒకేసారి రిలీజ్ చేసే ఆలోచనలో ఉంది సినిమా యూనిట్. మహేష్ బాబు కరియర్ లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా, రోజు రోజుకి ఫ్యాన్స్ లో క్రేజ్ ని ఇంక్రీజ్ చేస్తూనే ఉంది. ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే చేయలేదు కానీ, ఈ  సినిమాకి సంభవామి యుగే యుగే అని టైటిల్ ని ఖరారు చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.

మురుగదాస్ తో పాటు ఫాక్స్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి హారిస్ జయరాజ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఇంకా సెట్స్ పైనే ఉన్న ఈ సినిమా బడ్జెట్ 100 కోట్లు అని సమాచారం.