మహేష్ బాబు మూవీ లేటెస్ట్ అప్ డేట్స్

Wednesday,November 29,2017 - 11:25 by Z_CLU

కొరటాల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ మూవీ రేపటి నుండి డిసెంబర్ 7 వరకు హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ జరుకోనుంది. ఈ షెడ్యూల్ లో సినిమాలోని కీలక సన్నివేశాలను తెరకెక్కించే ప్రాసెస్ లో ఉన్న సినిమా యూనిట్, ఈ షెడ్యూల్ తరవాత ఇమ్మీడియట్ గా చెట్టినాడ్ బయలుదేరనుంది.

డిసెంబర్ 10 నుండి 25 వరకు చెట్టినాడ్ లోని కరైకుడి గ్రామంలో షూటింగ్ జరుపుకోనున్న సినిమా యూనిట్, మ్య్యాగ్జిమం ఈ ఇయర్ ఎండ్ కల్లా సినిమా షూటింగ్ కి ప్యాకప్ చెప్పాలని టార్గెట్ ఫిక్స్ చేసుకుంది.

D.V.V. దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకి DSP కంపోజ్ చేశాడు. ఏప్రిల్ 27 ని రిలీజ్ డేట్ గా ఫిక్స్ చెసుకున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.