మహేష్ బాబు మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్

Monday,April 10,2017 - 05:20 by Z_CLU

మహేష్ బాబు కరియర్ లోనే బిగ్గెస్ట్ యాక్షన్ అడ్వెంచరస్ మూవీ మురుగదాస్ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో సూపర్ స్టార్ ఇంటలిజెన్స్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఈ సినిమా జూన్ 23 న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కానుంది. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ కానీ, ఫస్ట్ లుక్ కానీ రిలీజ్ కాకపోవడంతో ఫ్యాన్స్ లో హై టెన్షన్ సస్పెన్స్ క్రియేట్ అయింది. అయితే ఆ సస్పెన్స్ కి ప్యాకప్ చెప్పనుంది సినిమా యూనిట్. ఈ సినిమా ఫస్ట్ లుక్ ని ఎట్టకేలకు రిలీజ్ చేయాలని డిసైడ్ అయింది మహేష్ బాబు & టీమ్.

మహేష్ బాబు సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న  ఈ సినిమా ఫస్ట్ లుక్ ని ఏప్రిల్ 12 సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేయనుంది సినిమా యూనిట్. బ్రేకింగ్ న్యూస్ లా బయటికి వచ్చిన ఈ అప్ డేట్ ఫ్యాన్స్ లో ఫెస్టివ్ సీజన్ ని పట్టుకొచ్చేసింది. హై ఎండ్ ఎక్స్ పెక్టేషన్స్ మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాకి హారిస్ జయరాజ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.