మహేష్ బాబు సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ డేట్

Saturday,January 13,2018 - 06:03 by Z_CLU

కొరటాల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ మూవీ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీ లో షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం సినిమాలోని కీలక సన్నివేశాలను తెరకెక్కించే ప్రాసెస్ లో ఉన్న సినిమా యూనిట్, మరోవైపు సంక్రాంతి ట్రీట్ గా ఈ సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసే ప్రాసెస్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

కంప్లీట్ ఫోకస్ ఫిల్మ్ మేకింగ్ పై తప్ప ఇప్పటి వరకు ఈ సినిమా ఫస్ట్ లుక్ పై కానీ టీజర్ రిలీజ్ విషయంలో కానీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేయని సినిమా యూనిట్, సంక్రాంతికి అదిరిపోయే సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్నట్టు ఫిల్మ్ నగర్ లో టాక్ నడుస్తుంది. మరి ఈ టాక్ ఎంతవరకు అఫీషియల్ గా ట్రాన్స్ ఫామ్ అవుతుందనేది మరో రెండు రోజుల్లో తెలిసిపోతుంది.

ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. D.V.V. దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజి కంపోజర్.