సోషల్ మీడియాలో బిగిన్ అయిన సూపర్ స్టార్ మానియా

Tuesday,January 16,2018 - 11:55 by Z_CLU

ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘భరత్ అనే నేను’ ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. పొలిటికల్ ఇమోషనల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫ్యాన్స్ లో రోజు రోజుకి క్యూరాసిటీ రేజ్ చేస్తూనే ఉంది. అయితే సంక్రాంతి రోజు మహేష్ బాబు టీమ్ నుండి, సమ్ థింగ్ స్పెషల్ అనిపించే రేంజ్ లో సర్ ప్రైజ్ గ్యారంటీ అని వెయిట్ చేసిన ఫ్యాన్స్ కోసం జనవరి 26 న ‘ఫస్ట్ ఓత్’ రిలీజ్ అని ఇంట్రెస్టింగ్ అనౌన్స్ మెంట్ చేసింది సినిమా యూనిట్.

జనవరి 26 న రివీల్ కాబోయే సూపర్ స్టార్ అప్పియరెన్స్ కోసం ఫ్యాన్స్ లో అపుడే కౌంట్ డౌన్ బిగిన్ అయిపోయింది. ఈ సినిమాలో ఫుల్ టైమ్ పొలిటీషియన్ లా, అందునా పవర్ ఫుల్ CM గా కనిపించనున్న మహేష్ బాబుని కొరటాల తన స్టైల్ లో ఎలా ప్రెజెంట్ చేయనున్నాడనే డిస్కషన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ ఎలిమెంట్ లా మారాయి.

D.V.V. దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. రాక్ స్టార్ DSP ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజర్.