ఆ వార్త నిజమే

Saturday,April 15,2017 - 06:00 by Z_CLU

అప్పట్లో సూపర్ స్టార్ మహేష్ – మణి రత్నం కాంబినేషన్ లో ఓ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని ఆ సినిమాలో విజయ్ కూడా ఓ కీ రోల్ చేస్తున్నాడనే వార్త కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా  చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే..

అయితే లేటెస్ట్ గా ఈ వార్త పై స్పందించాడు మహేష్. తాజాగా ‘స్పైడర్’ సినిమా ప్రమోషన్ లో భాగంగా చెన్నై వెళ్లిన సూపర్ స్టార్ ఓ ఇంటర్వ్యూ లో ఈ విషయం పై స్పందించాడు. “నిజానికి మణిరత్నం గారితో ఎప్పటి నుంచో సినిమా చేయాలనుకున్నాను. ఇక విజయ్ నా కాంబినేషన్ లో మణి రత్నం గారు ఓ సినిమా ప్లాన్ చేసిన వార్త నిజమే కానీ అడిగి స్టార్టింగ్ స్టేజ్ లోనే ఆగిపోయిందని కానీ మణిరత్నం గారి తో ఎప్పటికైనా ఓ సినిమా చేస్తానని” అన్నారు.. సో అప్పట్లో హల్చల్ చేసిన మణిరత్నం-మహేష్-విజయ్ కాంబో వార్త నిజమే అన్నమాట.