మరోసారి వాయిదాపడిన మహర్షి

Wednesday,March 06,2019 - 03:17 by Z_CLU

లెక్కప్రకారం ఏప్రిల్ 5న థియేటర్లలోకి రావాలి మహర్షి సినిమా. కానీ ఆ మూవీని ఏప్రిల్ 25కి పోస్ట్ పోన్ చేశారు. ఆ డేట్ కోసం ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తుండగా, అంతలోనే మరోసారి సినిమా వాయిదాపడింది. ఈ విషయాన్ని దిల్ రాజు స్వయంగా ఎనౌన్స్ చేశాడు.

“వంశీ పైడిపల్లి కష్టపడి తయారుచేసిన స్క్రిప్ట్ ఇది. సినిమా అద్భుతంగా వచ్చింది. షూటింగ్ అయితే అనుకున్న టైమ్ కు పూర్తిచేయగలుగుతున్నాం కానీ పోస్ట్ ప్రొడక్షన్ అవ్వడం లేదు. ఇంత కష్టపడి చేసిన సినిమాను హడావుడిగా పోస్ట్ ప్రొడక్షన్ చేయడం ఇష్టం లేదు. నిన్న హీరో మహేష్, దర్శకుడు వంశీతో మాట్లాడి, మే 9న రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాం. అద్భుతంగా వచ్చిన సినిమాకు అవుట్ పుట్ కూడా అదే రేంజ్ లో ఉండాలి. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వదల్చుకోలేదు. అందుకే మే 9కు వాయిదా వేస్తున్నాం.”

మహర్షి సినిమాకు సంబంధించి ఈనెల 17తో టోటల్ టాకీ కంప్లీట్ అవుతుందని ప్రకటించాడు దిల్ రాజు. 2 పాటలు, మాంటేజ్ షాట్స్ పెండింగ్ ఉన్నాయని, ప్రస్తుతం అబుదాబిలో మాంటేజ్ షాట్స్ తీస్తున్నారని తెలిపాడు. సో.. మహేష్ బాబు సినిమా కోసం ఇంకాస్త వెయిటింగ్ తప్పదన్నమాట.