న్యూయార్క్ లో మహేష్ బాబు

Tuesday,August 28,2018 - 05:48 by Z_CLU

రీసెంట్ గా మహేష్ బాబు పూజా హెగ్డే కాంబినేషన్ లో సాంగ్ తెరకెక్కించింది మహర్షి టీమ్. హైదరాబాద్ లో జరిగిన ఈ షెడ్యూల్ కి ప్యాకప్ చెప్పిన ఫిల్మ్ మేకర్స్, నెక్స్ట్ షెడ్యూల్ ప్రిపరేషన్స్ బిగిన్ చేశారు. సెప్టెంబర్ నుండి అమెరికాలో షూటింగ్ జరుపుకోనుంది మహర్షి టీమ్.

2 నెలల పాటు జరుపుకోనున్న ఈ భారీ షెడ్యూల్ లో సినిమాలోని కీలక సన్నివేశాలను తెరకెక్కించనుంది సినిమా యూనిట్. ఇప్పటికే U.S. లోని కొన్ని పర్టికులర్ లొకేషన్స్ ని లాక్ చేసుకున్న ఫిల్మ్ మేకర్స్, న్యూయార్క్, కాలిఫోర్నియా తో పాటు లాస్ వెగాస్ లో సినిమాని తెరకెక్కించనున్నారు.

దిల్ రాజు, PVP తో పాటు అశ్విని దత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి వంశీ పైడిపల్లి డైరెక్టర్. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.