మహేష్ బాబు 'మహర్షి' సినిమా అప్డేట్స్

Tuesday,December 25,2018 - 10:58 by Z_CLU

హైదరాబాద్ షెడ్యూల్ కి ప్యాకప్ చెప్పేసింది ‘మహర్షి’ టీమ్. రామోజీ ఫిల్మ్ సిటీ లో దాదాపు 8 కోట్ల వ్యయంతో వేసిన విలేజ్ సెట్ లో సినిమాకి సంబంధించిన కీలక సన్నివేశాలను తెరకెక్కించిన సినిమా యూనిట్, సక్సెస్ ఫుల్ గా ఈ షెడ్యూల్ ని ముగించింది. ప్రస్తుతం బ్రేక్ మోడ్ లో ఉన్న మహర్షి  టీమ్, వచ్చే నెలలో నెక్స్ట్ షెడ్యూల్ బిగిన్ చేయనుంది.

తమిళనాడు లోని పొలాచి లో ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ కి ప్లానింగ్  జరుగుతుంది. ఈ షెడ్యూల్ కి సంబంధించి ఇప్పటికే ప్రిపరేషన్స్ బిగిన్ చేసిన టీమ్, త్వరలో పొలాచికి బయలుదేరనుంది. మహేష్ బాబు 25 వ సినిమా అనగానే ఫ్యాన్స్ లో క్రియేట్ అయిన అంచనాలకు తగ్గట్టు ఏ మాత్రం కాప్రమైజ్ కాకుండా సినిమాని తెరకెక్కించే ప్రాసెస్ లో ఉన్నారు మేకర్స్. ఈ సినిమాలో అల్లరి నరేష్ కీ రోల్ ప్లే చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఏప్రిల్ 5 రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమాకి DSP మ్యూజిక్ కంపోజర్. దిల్ రాజు, అశ్విని దత్ మరియు PVP సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. వంశీ పైడిపల్లి ఈ సినిమాకి డైరెక్టర్.