మహేష్ కు తాజాగా నచ్చిన సినిమా ఇది....

Wednesday,December 14,2016 - 06:00 by Z_CLU

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ గా ఓ ట్రైలర్ చూసి ఫిదా అయిపోయాడట. ఇంతకీ అది ఏ సినిమా ట్రైలర్ ? మహేష్ చూసి పొగిడేంత, ఆ ట్రైలర్ లో ఏముంది? అనుకుంటున్నారా? హేవే లుక్….

తన ఫీలింగ్స్ ను ఎప్పటికప్పుడు ట్విట్టర్ ద్వారా ఫ్యాన్స్ తో పంచుకునే మహేష్.. లేటెస్ట్ గా ఓ హిందీ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను చూశాడు. ఆ సినిమా మరేదో కాదు తమిళ్ లో మణిరత్నం తెరకెక్కించిన ‘ఓకే కన్మణి’. ఈ సినిమా తెలుగు లో ‘ఓకే బంగారం’ పేరుతో రిలీజ్ అయి ఇక్కడ కూడా హిట్ అందుకుంది. అయితే లేటస్ట్ గా ఈ సినిమా బాలీవుడ్ లో రీమేక్ అవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ లేటెస్ట్గా రిలీజ్ అయి అందరి ప్రశంసలు అందుకుంటోంది.ముఖ్యంగా ఈ ట్రైలర్ లో సినిమాటోగ్రాఫర్ రవి కె చంద్రన్ పనితనానికి ఎక్కువ ప్రశంసలు వస్తున్నాయి. ఇటీవలే ఈ ట్రైలర్ చూసిన మహేష్ అబ్సల్యూట్ విజువల్ ట్రీట్… బ్రిలియంట్ వర్క్ అంటూ రవి కె చంద్రన్ ను మెచ్చుకున్నాడు. త్వరలో మహేష్-కొరటాల సినిమాకు వర్క్ చేయబోతున్నాడు ఈ సినిమాటోగ్రాఫర్.

mahesh-babu-tweet