'సితార' సాంగ్ ను రిలీజ్ చేసిన సూపర్ స్టార్

Wednesday,February 01,2017 - 08:28 by Z_CLU

సాయి ధరమ్ తేజ్ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వం లో తెరకెక్కుతున్న ‘విన్నర్’ సినిమాలోని ‘సితార’ అనే ఫస్ట్ సాంగ్ ను సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసి టీంకి శుభాకాంక్షలు తెలిపాడు సూపర్ స్టార్ మహేష్. థమన్ మ్యూజిక్ అందించిన ఈ పాట ప్రెజెంట్ సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంది.

mahesh-tweet-capture

సాయి ధరమ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న ఈ సినిమాను లక్ష్మి నరసింహ ప్రొడక్షన్ బ్యానర్ పై నల్లమలపు బుజ్జి, ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు.ప్రెజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఫిబ్రవరి 24 రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.