మహేష్ బాబు కొరటాల మూవీ అప్ డేట్స్

Tuesday,June 06,2017 - 06:15 by Z_CLU

మే 22 న సెట్స్ పైకి వచ్చిన మహేష్ బాబు కొరటాల శివ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ కోసం రెడీ అవుతుంది. ఫస్ట్ షెడ్యూల్ లో, మహేష్ బాబు చైల్డ్ హుడ్ సీక్వెన్సెస్ ని తెరకెక్కించిన సినిమా యూనిట్, పొలిటికల్ లీడర్ లా కనిపించనున్న మహేష్ బాబు కోసం పెద్ద అసెంబ్లీ సెట్ నే ప్లాన్ చేస్తుంది.

ప్రస్తుతం స్పైడర్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న సూపర్ స్టార్, రేపో మాపో ఈ సెట్స్ ఫై భారీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. నెక్స్ట్ ఇయర్ జవరి 11 న రిలీజ్ కి ఫిక్స్ అయిన ఈ సినిమా అల్టిమేట్ పొలిటికల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనుంది. కైరా అద్వానీ హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.