మహేష్ బాబు కొరటాల మూవీ టైటిల్ లాంచ్

Tuesday,January 23,2018 - 07:45 by Z_CLU

మహేష్ బాబు కొరటాల మూవీ ‘ఫస్ట్ ఓత్’ జనవరి 26 రిలీజ్ కానుందని రీసెంట్ గా అనౌన్స్ చేసింది సినిమా యూనిట్. అయితే ఆ ‘ఫస్ట్ ఓత్’ ఏమిటనే విషయంలో ఫ్యాన్స్ లో క్యూరాసిటీ రేజ్ చేసిన ఫిల్మ్ మేకర్స్, ఈ రోజు ఆ విషయంలో క్లారిటీ ఇచ్చారు. రిపబ్లిక్ డే రోజు మార్నింగ్ 7 గంటలకు ఈ సినిమా టైటిల్ ని లాంచ్ చేయనునుంది సినిమా యూనిట్. ఇప్పుడీ అప్ డేట్ సోషల్ మీడియాలో వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుంది.

మహేష్ బాబు చీఫ్ మినిస్టర్ గా కనిపించనున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ లో నెక్స్ట్ లెవెల్ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. మహేష్ బాబు సరసన కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని D.V.V. దానయ్య ప్రొడ్యూసర్. రాక్ స్టార్ DSP మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.