CM చాంబర్ లో బిజీగా ఉన్న మహేష్ బాబు

Tuesday,October 17,2017 - 11:48 by Z_CLU

మహేష్ బాబు కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పొలిటికల్ ఎంటర్ టైనర్ ‘భరత్ అనే నేను’ ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ తరవాత హై ఎండ్ ఎక్స్ పెక్టేషన్స్ మధ్య రిపీట్ అవుతున్న ఈ కాంబో, ప్రస్తుతం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో షూటింగ్ జరుపుకుంటుంది.

అక్టోబర్ 14 న బిగిన్ అయిన ఈ షెడ్యూల్ లో సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను తెరకెక్కించే ప్రాసెస్ లో ఉంది సినిమా యూనిట్. ఈ షెడ్యూల్ కోసం ప్రత్యేకంగా వేసిన CM చాంబర్ సెట్ లో నవంబర్ 8 వరకు షూటింగ్ జరుపుకోనుంది BAN టీమ్.

కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు కాంటెంపరరీ సోషల్ మెసేజ్ ను కూడా ఇంటరెస్టింగ్ మోడ్ లో ప్రెజెంట్ చేసే కొరటాల, ఈ సినిమాలో మహేష్ బాబును సరికొత్త ఆంగిల్ లో ప్రెజెంట్ చేయనున్నాడు. కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని D.V.V. దానయ్య నిర్మిస్తుండగా, రాక్ స్టార్ DSP ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజర్.