మహేష్ బాబు ఇంటర్వ్యూ

Saturday,May 04,2019 - 06:50 by Z_CLU

మే 9న ‘మహర్షి’ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు సూపర్ స్టార్. రిలీజ్ కి రెడీ అయిన ‘మహర్షి’ గురించి కొన్ని విషయాలు మీడియాతో పంచుకున్నాడు మహేష్. ఈ సినిమా  గురించి మహేష్ చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే…

కాలేజి ఎపిసోడ్ నా ఫేవరేట్

ఈ సినిమాలో నా ఫేవరేట్ పార్ట్ కాలేజ్ ఎపిసోడ్.. అది సినిమాకు చాలా ఇంపార్టెంట్. రెండు డికేడ్స్ అయిపోయాయి. 25 సినిమాలు చేసేశాను. ఈ టైంలో కాలేజి పార్ట్ అంటే మాములు విషయం కాదు. పైగా అదీ జస్ట్ పది నిమిషాలో..ఇరవై నిమిషాలో ఉండదు. ప్రాపర్ గా 45 నిమిషాల బ్లాక్ అది. కన్విన్సింగ్ గా చేసామని నమ్ముతున్నాం. అందుకే అది నా ఫేవరేట్ బ్లాక్.

 

ఎవరూ చూసి ఉండరు

మహర్షి ఒక జెన్యూన్ ఫిలిం. అందరికీ కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ ఉంటాయి. ఇంత డెప్త్ ఉన్న క్యారెక్టర్ నేను ఇప్పటి వరకూ వినలేదు. మహర్షి లో అంత డెప్త్ ఉంది. ఈ మధ్య కాలంలో ఆడియన్స్ కూడా ఎవరూ ఇంత జెన్యూన్ ఫిలిం చూసుండరు. అన్ని ఆంగిల్స్ కవర్ చేస్తూ , అన్ని ఎమోషన్స్ వచ్చి… క్లాస్ , మాస్, ఫ్యామిలీస్ ఇలా అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా మహర్షి.


హ్యాట్సాప్ టు వంశీ

‘మహర్షి’ లాంటి కథను నాకు చెప్పి నాకోసం మూడేళ్ళు వెయిట్ చేసి సినిమా తీసినందుకు వంశీ కి థాంక్స్ చెప్పాలి. అన్ని కవర్ చేస్తూ ఓ సినిమా చేయడం కష్టం. ముఖ్యంగా ఫ్యాన్స్ ని కూడా ఎగ్జైట్ చేస్తూ  వాళ్ళని థియేటర్స్ లో ఫుల్ ఫ్లెడ్జ్ గా ఎంటర్టైన్ చేయబోతున్నందుకు వంశీ కి హ్యాట్సాప్ చెప్పాలి. అలాగే మొత్తం టీం కి థాంక్స్.

గ్రేట్ గా ఫీలవుతున్నా

నాకోసం రైటర్స్ మంచి పవర్ ఫుల్ మెసేజ్ ఉన్న కథలు రాస్తున్నారు. అందువల్లే ఇలాంటి సినిమాలు చేయగలుగుతున్నా. శ్రీమంతుడు…  భరత్ అనే నేను, ఇప్పుడు మహర్షి. ఇలాంటి మంచి సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలు నాకొచ్చినందుకు గ్రేట్ ఫుల్ గా ఫీలవుతున్నా.

లుక్స్ ఎట్రాక్ట్ చేస్తాయి

మొన్నటి వరకూ ఒకే లుక్ లో కనిపిస్తున్నానని అన్నారు. ఇందులో మూడు లుక్స్ ఉంటాయి. స్టూడెంట్ కి ఓ లుక్, సి.ఇ.ఓ కి ఓ లుక్,  విలేజ్ కి వచ్చాక ఓ లుక్ ఉంటాయి. ఈ మూడు లుక్స్ అందరినీ ఎట్రాక్ట్ చేస్తాయనుకుంటున్నా.

మూడు ప్రెస్టిజియస్ బ్యానర్స్

మహర్షి చాలా పెద్ద ప్రాజెక్ట్. ముగ్గురు ప్రొడ్యూసర్స్ అనగానే హ్యాపీ గా ఫీలయ్యాను. మూడు ప్రెస్టిజియస్ బ్యానర్స్. చాలా సపోర్ట్ చేసారు. వాళ్ళకి నా థాంక్స్.


అది నాచేతిలో లేదు

భరత్ అనే నేను తర్వాత ఒక నెల మాత్రమే గ్యాప్ తీసుకున్నాను. ఈరోజుల్లో సినిమా అనేది చాలా టఫ్ టాస్క్ అయిపోయింది. అప్పట్లో నాన్న గారు వాళ్ళందరూ మూడు వందలు, నాలుగు వందల సినిమాలు చేసేవారు. ఇప్పుడు ఇరవై ఐదో సినిమాకే ఒక ల్యాండ్ మార్క్ సినిమా అని సెలెబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు సినిమాలకు టైం పడుతుంది. ఒక పెద్ద సినిమా చేయాలంటే ఎనిమిది నెలలు లేదా పది నెలలు పడుతుంది. సో అది నా చేతిలో లేదు. ఆడియన్స్ కి ఒక పర్ఫెక్ట్ సినిమా ఇవ్వాలంటే తప్పదు.

ఆ సినిమాకు మహర్షి కి సంబందమే లేదు

3 ఇడియట్ కి మహర్షి కి ఎలాంటి సంబంధం లేదు. కొన్ని సీన్స్ చూసి ఎవరైనా అలా ఊహించుకొని ఉండొచ్చు కానీ సినిమా చూస్తే తెలుస్తుంది. అసలు మహర్షి కథే వేరు.

చెప్పిందే తీసాడు…

వంశీ నాకు ఒక గంటన్నర పాటు కథ చెప్పాడు. క్లారిటీ తో బెస్ట్ అవుట్ పుట్ తీసుకున్నాడు. నాకు ఏం చెప్పాడో అదే తీసాడు. రేపు రిలీజ్ తర్వాత వంశీ కే ఎక్కువ పేరొస్తుంది. వంశీ అండ్ టీం ఫెంటాస్టిక్. హరి , సోలోమాస్ వంశీ తో కలిసి స్క్రిప్ట్ మీద చాల వర్క్ చేసారు. వారికి కూడా థాంక్స్ చెప్తున్నా.

చేస్తారా..కనుక్కోండి అన్నాను

వంశీ ఈ కథ చెప్పేటప్పుడే అల్లరి నరేష్ గారి పేరుతో చెప్పాడు. చాలా బాగుంటుంది కానీ ఆయన చేస్తారా.. కనుక్కోండి అని చెప్పాను. కథ వినగానే నరేష్ చేస్తున్నాడు అని చెప్పారు.

ఫ్రెష్ కథ

శ్రీమంతుడు కి మహర్షి కి ఎలాంటి కంపారిజన్స్ ఉండవు. టీజర్ చూసి అలా అనుకోవచ్చు కానీ ఇది వేరే కథ. ఫ్రెష్ సబ్జెక్ట్. అది మే 9 న మీరే ఎక్స్ పీరియన్స్ చేస్తారు. అంతకు మించి నేనేం చెప్పను.


అదే కరెక్ట్

ఎవరైనా బౌండెడ్ స్క్రిప్ట్ తోనే సినిమా చేయాలి. షూటింగ్ లో ప్రాపర్ స్క్రిప్ట్ లేకుండా కొంచెం స్క్రిప్ట్ తో ఒక షెడ్యుల్ చేసి మళ్ళీ బ్రేక్ ఇచ్చి ఇంకో షెడ్యుల్ కంటిన్యూ చేయడం కరెక్ట్ కాదు. షూటింగ్ లో స్క్రిప్ట్ గురించి డిస్కర్షన్ ఉండకూడదనేది నా అభిప్రాయం. అందుకే ఇకపై బౌండెడ్ స్క్రిప్ట్స్ తోనే సినిమాలు చేయాలనుకుంటున్నా. ఫెయిల్యుర్స్ నుండి నేర్చుకున్న గుణపాఠం ఇది. గతంలో నేను చేసిన తప్పుల ద్వారా రియలైజ్ అయ్యాను. బ్రహ్మోత్సవం , స్పైడర్ ఒక ఇరవై నిమిషాల నెరేషన్ విన్నప్పుడు చాలా ఎగ్జైటింగ్ గా అనిపించాయి. కానీ షూటింగ్ మొదలయిన వెంటనే తెలిసిపోయింది. ఎక్కడో మన లోపల భయమే చెప్పేస్తుంది. అందుకే మళ్ళీ ఆ తప్పు చేయకూడదని డిసైడ్ అయ్యాను.

 

అది నా మిస్టేక్

యూరప్ నుండి ఒక 16 హవర్స్ ఫ్లైట్ తీసుకొని వచ్చి, హడావిడి వల్ల అందరి గురించి మాట్లాడలేకపోయాను. పైగా అప్పటికే ఫ్యాన్స్ స్టేజి మీదకి వచ్చేసారు. అందుకే పూరి జగన్ ని థాంక్ చేయలేకపోయాను. అది నా మిస్టేక్. పోకిరి అనేది నన్ను ఓ సూపర్ స్టార్ ని చేసిన సినిమా. అలాగే సుకుమార్ గారికి కూడా థాంక్స్ చెప్పాలనుకొని మిస్ అయ్యాను. 1 నేనొక్కడినే అనేది ఓ కల్ట్ ఫిలిం. ఆ సినిమాలో నా కొడుకుతో కలిసి యాక్టింగ్ చేసే అవకాశం లభించింది. సుకుమార్ గారు వన్ ఆఫ్ మై ఫేవరేట్ డైరెక్టర్.

వంశీ ని పొడిగాను

మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వంశీ మూడేళ్ళు ఉన్నాడు. ఈరోజుల్లో రెండు నెలలు కూడా ఎవరూ వెయిట్ చేయరని అన్నాను. అది వంశీని పొగడడానికి అన్నదే కానీ సుకుమార్ గారిని ఉద్దేశించి కాదు. సుకుమార్ గారు నాకు వెరీ స్పెషల్ డైరెక్టర్. నాకు మంచి ఫ్రెండ్ కూడా. త్వరలోనే ఇద్దరం కలిసి మళ్ళీ సినిమా చేస్తాం.

అందుకే వద్దనుకున్నా…

నిజానికి సుకుమార్ గారితో సినిమా క్యాన్సల్ అవ్వడానికి రీజన్ ఉంది. వరుసగా ఒకే పాటర్న్ లో సినిమాలు అవుతున్నాయని కాస్త ఎంటర్టైన్ మిక్స్ చేసి దూకుడు లాంటి సినిమా చేయాలనుకున్నాను. అందుకే అనిల్ తో సినిమా కరెక్ట్ అనుకున్నాను. అదే విషయాన్నీ సుకుమార్ గారికి చెప్పాను. ఆయన కూడా అదే ఫీలయ్యి సరే మీరొక సినిమా చేసి రండి నేనొక సినిమా చేసి వస్తా అని చెప్పారు. ఫ్యూచర్ లో మేం మళ్ళీ కలిసి సినిమా చేస్తాం.

జూన్ నుండి షూటింగ్

అనిల్ రావిపూడి డైరెక్షన్ లో నేను చేయబోయే సినిమా జూన్ ఎండ్ నుండి షూట్ స్టార్ట్ అవుతుంది. మంచి కథ నాకు మళ్ళీ రిఫ్రెషింగ్ అనిపించే సినిమా.