మహేష్ బాబు ఇంటర్వ్యూ

Wednesday,April 18,2018 - 06:44 by Z_CLU

‘భరత్ అనే నేను’ బ్లాక్ బస్టర్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఫిల్మ్ మేకర్స్. ఇక మహేష్ బాబు విషయానికి వస్తే ఎప్పుడూ సినిమా రిలీజ్ తరవాత వెకేషన్ కి వెళ్ళేవాడు. అలాంటిది కాన్ఫిడెంట్ గా సినిమా రిలీజ్ కి ముందే హాలీడేస్ ప్లాన్ చేసుకున్నాడు. ఈ నెల 20 న రిలీజవుతున్న ఈ కమర్షియల్ పొలిటికల్ ఎంటర్ టైనర్ గురించి మీడియాతో చాలా విషయాలు షేర్ చేసుకున్నాడు. అవి మీకోసం…

బ్లాక్ బస్టర్ ఫీలింగ్…

రిలీజ్ కి ముందే బ్లాక్ బస్టర్ వైబ్ లో ఉన్నాం. నా కరియర్ లోనే బెస్ట్ ప్రీ రిలీజ్ ఫేజ్ ఇది. అడ్వాన్స్ బుకింగ్స్ కానీ, రెస్పాన్స్ కానీ చూస్తుంటే చాలా హ్యాప్పీగా ఉంది. ఇంత ఆనందం ఎప్పుడూ లేదు.

చెప్పగానే భయపడ్డాను…

శివగారు నాకు కథ చెప్పినప్పుడు ఓ వైపు ఎగ్జైటెడ్ గా అనిపించింది మరోవైపు భయం వేసింది. నాకు, రాజకీయాలకు అసలు సంబంధం లేదు, నాలెడ్జ్ లేదు. అలాంటిది ఈ సినిమా చేయగలనా అనిపించింది.

 

క్రెడిట్ శివగారిదే…

ఇలాంటి పొలిటికల్ సినిమా చేసేటప్పుడు చాలా విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. స్టోరీ రాసుకునేటప్పుడు కానీ, డైలాగ్స్ విషయంలో కానీ ఎక్కడా లాజిక్స్ మిస్సవ్వకూడదు. దానికి తోడు ప్రతీది నా బాడీ లాంగ్వేజ్ కి సూటయ్యేలా ఎక్స్ట్రా   ఆర్డినరీగా డిజైన్ చేసుకున్నారు…

పెద్దగా హోమ్ వర్క్ చేయలేదు కానీ…

ఇంత పెద్ద డైలాగ్స్ చెప్పడం నా కరియర్ లో ఇదే ఫస్ట్ టైమ్. అసెంబ్లీ లో చెప్పే డైలాగ్స్ కానీ, ఆ లాంగ్వేజ్ కానీ శివ గారు చాలా హెల్ప్ చేశారు. దానితో పాటు పార్లమెంట్ లో మా బ్రదర్ ఇన్ లా జయదేవ్ గారి స్పీచెస్ కొన్ని చూశాను అంతే…

కంప్లీట్ ఫ్రెష్ అప్రోచ్…

ఏ పాలిటీషియన్ ని మేము ఇమిటేట్ చేసే ప్రయత్నం చేయలేదు. డైలాగ్స్ విషయంలో కానీ, మీరు గమనిస్తే కాస్ట్యూమ్స్ విషయంలో కూడా కంప్లీట్ గా ఫార్మల్స్ వాడాం. సినిమాలో ప్రతీది కంప్లీట్ గా ఫ్రెష్ అప్రోచ్…

రియల్ గా జరిగింది…

అసెంబ్లీ సెట్ షూటింగ్ జరిగినప్పటి నుండే మాలో పాజిటివ్ వైబ్స్ బిగిన్ అయిపోయాయి. ఏదో షూటింగ్ కి వచ్చినట్టు కాకుండా అసెంబ్లీకి వచ్చినట్టే అటెండ్ అయ్యాం అందరం. షాట్ ఉన్నా లేకపోయినా అందరూ, ఆ సీన్ అయిపోయేంత వరకు అసెంబ్లీ లోనే ఉండేవాళ్ళు… అంత రియల్ గా జరిగింది.

 

 

నా లైఫ్ సినిమాలకే…

ఈ సినిమా చూశాక పాలిటిక్స్ లో జాయిన్ అవ్వాలి అనే ఆలోచన రావడం లాంటివి ఏమీ లేవు. ఫ్యూచర్ లో కూడా ఉండదు. నాకు సినిమాలే  తెలుసు… లైఫంతా సినిమాలు చేసుకుంటూనే ఉంటాను…

CM అంటే బాధ్యత…

CM అంటే ఎంత పెద్ద బాధ్యతో ఈ సినిమా చేశాను కాబట్టే అర్థమైంది. జస్ట్ కాన్వాయ్ లో తిరగడం, Z క్యాటగిరీ సెక్యూరిటీ ఇవి కాదు CM అంటే… మీరు సినిమా చూస్తే మీకు అర్థమైపోతుంది.

2 పార్ట్స్ చేసి ఉండాల్సింది…

శివగారు 5 గంటలు చెప్పారీ కథను. ఒకరోజు రెండున్నర గంటలు.. నెక్స్ట్ డే రెండున్నర గంటలు… వింటున్న ప్రతి సీన్ ఎగ్జైటెడ్ గా నిపించింది. సినిమాలో ఇంకా చాలా సీన్స్ తీసేశారు కూడా. ఈ సినిమా పార్ట్ 1, పార్ట్ 2 గా రిలీజ్ చేసి ఉండాల్సింది.

ప్రీ పోన్ అవ్వడం బ్లెస్సింగ్…

సినిమా రిలీజ్ ప్రీ పోన్ అయిందన్న విషయం తెలిసినపుడు కూడా ఆ రోజు మా అమ్మ బర్త్ డే అన్న విషయం నాకు గుర్తు లేదు. ఆ తరవాత మంజుల కాల్ చేసి చెప్పేసరికి, సినిమా రిలీజ్ అదే రోజు ఫిక్సవ్వడం బ్లెస్సింగ్ లా  అనిపించింది.

వంశీకి చాలా పెద్ద థాంక్స్…

జూన్ లో స్టార్ట్ అవుతుంది వంశీతో సినిమా… నిజానికి వంశీకి చాలా థాంక్స్ చెప్పుకోవాలి… నాకోసం 2 ఇయర్స్ వెయిట్ చేశాడు.

అందుకే కైరా అద్వానీ…

ఇలాంటి పొలిటికల్ ఎంటర్ టైనర్… అందునా CM కి గర్ల్ ఫ్రెండ్ లా అంటే ఎస్టాబ్లిష్ అయిన హీరోయిన్ కంటే ఫ్రెష్ ఫేస్ అయితే బెటర్ అనుకున్నాం. అప్పుడే MS ధోని సినిమా చూడటం జరిగింది. అపుడు కైరా అయితే బెటరనుకుని కాంటాక్ట్ చేయడం జరిగింది.. చాలా బాగా పర్ఫామ్ చేసింది తను…

 

అచ్చం నాన్నగారి లాగే…

సినిమా ఫస్ట్ ఓత్ రిలీజ్ అయినప్పుడు చాలా మంది అచ్చం నాన్నగారి వాయిస్ లాగే ఉందన్నారు. సినిమాలో  కూడా చాలా చోట్ల అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే నేనింతవరకు అంత హై పిచ్ లో డైలాగ్స్ చెప్పలేదు. ఈ సినిమాలోనే ఫస్ట్ టైమ్. చాలా హ్యాప్పీ…

నేనలా అనుకోను…

నేనెప్పుడూ నాన్నగారిని ఇమిటేట్ చేయాలనుకోను. నేను నాన్నగారి ప్రతి సినిమా చేస్తాను. అలాంటప్పుడు ఎపుడైనా డైలాగ్స్ చెప్తున్నపుడు నాకు తెలీకుండానే ఆయన లాగే చేయడం జరిగిపోతుంటుంది.

కరియర్ బెస్ట్…

భరత్ అనే నేను, వచ్చాడయ్యో సామీ నామోస్ట్ ఫేవరేట్ సాంగ్స్ ఈ సినిమాలో. నా కరియర్ లోనే బెస్ట్ సాంగ్స్.