సుకుమార్ డైరెక్షన్ లో సూపర్ స్టార్..?

Thursday,April 12,2018 - 07:03 by Z_CLU

సుకుమార్ ‘రంగస్థలం’ బ్లాక్ బస్టర్ హిట్టయింది. రామ్ చరణ్ ని కంప్లీట్ గా డిఫెరెంట్ డైమెన్షన్ లో ప్రెజెంట్ చేసిన ఈ సినిమా, కంప్లీట్ కాన్సంట్రేషన్ సుకుమార్ పై మళ్ళేలా చేసింది. ఇంతకీ సుకుమార్ తన నెక్స్ట్ సినిమా ఎవరితో చేయబోతున్నాడు అనే క్వశ్చన్, ఇప్పుడు ఫ్యాన్స్ లో రేజ్ అవుతుంది. నిన్నటి వరకు ఈ వరసలో అల్లు అర్జున్ పేరు వినిపించినా, లేటెస్ట్ గా ఈ ప్లేస్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు వచ్చి చేరడంతో సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ స్పెక్యులేషన్స్ క్రియేట్ అవుతున్నాయి.

మహేష్ బాబు గతంలో సుకుమార్ తో వన్ – నేనొక్కడినే సినిమా చేశాడు. అయితే ఇప్పుడు సుకుమార్ నెక్స్ట్ లిస్టులో మహేష్ బాబు పేరు చేరడానికి స్ట్రాంగ్ రీజన్, మైత్రి మూవీ మేకర్స్ దగ్గర సుకుమార్ తో పాటు మహేష్ బాబు కాల్షీట్స్ కూడా ఉండటమే. సుకుమార్ మైండ్ లో ఎగ్జాక్ట్ గా ఏం నడుస్తుందో తెలీదు కానీ, ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నట్టు, ఈ కాంబో మరోసారి సెట్స్ పైకి టాలీవుడ్ లో మరో సెన్సేషన్ కి గ్రౌండ్ వర్క్ బిగిన్ అయినట్టే.

ప్రస్తుతం ‘భరత్ అనే నేను’ సెట్స్ పై ఉన్న మహేష్ బాబు ఈ సినిమా తరవాత ఇమ్మీడియట్ గా వంశీ పైడిపల్లి తో తన 25 వ సినిమాతో సెట్స్ పై ఉన్నాడు అది పక్కా కన్ఫమ్. కానీ మహేష్ బాబు 26 వ సినిమా త్రివిక్రమ్ తో ఉండబోతుందా లేకపోతే, సుకుమార్ తో ఉండబోతుందా అనేది ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తే తెలిసిపోతుంది.