మెగాస్టార్ సినిమాలో సూపర్ స్టార్?

Monday,February 24,2020 - 11:54 by Z_CLU

ఇది అలాంటిలాంటి కాంబినేషన్ కాదు. ప్రేక్షకులు కలలో కూడా ఊహించని కాంబో. అవును.. మెగాస్టార్ సినిమాలో సూపర్ స్టార్ నటించబోతున్నాడు. చిరంజీవి అప్ కమింగ్ మూవీలో మహేష్ బాబు కనిపించబోతున్నాడు. ప్రస్తుతం గాసిప్ లెవెల్లో ఉన్న ఈ మేటర్.. నిజమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

ఇంతకీ మేటర్ ఏంటంటే.. చిరంజీవి-కొరటాల కాంబోలో ఆచార్య అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర ఉంది. దాదాపు 30 నిమిషాల స్క్రీన్ స్పేస్ ఉండే ఆ పాత్రను రామ్ చరణ్ తో చేయించాలని చిరు అనుకున్నారు. కానీ ఆర్ఆర్ఆర్ డిలే వల్ల అది సాధ్యం కాలేదు. దీంతో ఇప్పుడు ఆ పాత్ర కోసం మహేష్ ను సంప్రదించినట్టు టాక్.

కొరటాల-మహేష్ మధ్య మంచి అనుబంధం ఉంది. శ్రీమంతుడు, భరత్ అనే నేను రూపంలో మహేష్ కు రెండు బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు కొరటాల. దీంతో కొరటాల గట్టిగా కోరితే మహేష్ నో చెప్పే అవకాశం ఉండదు. పైగా ఇది మెగాస్టార్ సినిమా. చిరు ఒక్క మాట అడిగితే చాలు మహేష్ ఎస్ అనడం గ్యారెంటీ. అయినా మెగాస్టార్-మహేష్ మధ్య బాండింగ్ ఎలా ఉంటుందో సరిలేరు నీకెవ్వరు ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో అందరం చూశాం.

పైగా మహేష్ అడిగినంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి కూడా నిర్మాతలు (రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి) రెడీగా ఉన్నారట. పైగా మహేష్ ఇప్పుడు కొత్త సినిమా ఏదీ ప్రకటించలేదు. అతడి కాల్షీట్లు ఖాళీగానే ఉన్నాయి. సో.. ఎలా చూసుకున్నా మహేష్ నో చెప్పే అవకాశాలైతే లేవు. కాంబినేషన్ సెట్ అయ్యేలానే ఉంది.