Sarkaru Vaari Paata యాక్షన్ ఎపిసోడ్

Tuesday,February 09,2021 - 05:00 by Z_CLU

దుబాయ్ లో షూట్ జరుపుకుంటున్న సినిమా కోసం యాక్షన్ మోడ్ లోకి వెళ్ళాడు సూపర్ స్టార్. ప్రస్తుతం పరశురాం డైరెక్షన్ లో మహేష్ నటిస్తున్న  ‘సర్కారు వారి పాట‘ కి సంబంధించి దుబాయ్ ఎడారిలో భారీ ఎత్తున ఓ యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేస్తున్నారు యూనిట్.  రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ నేతృత్వంలో భారీ సెటప్ లో బైక్ రైడర్స్ తో మహేష్ ఫైట్ సీక్వెన్స్ షూట్ జరుగుతుంది.

సినిమాలో ఓ సందర్భంలో వచ్చే ఈ యాక్షన్ ఎపిసోడ్ హైలైట్ గా నిలుస్తుందని యూనిట్ చెప్తున్నారు. ఇప్పటికే మహేష్ బాబు ఫైట్ చేస్తున్న పిక్స్ సోషల్ మీడియాలో లీకై వైరల్ అవుతున్నాయి.  దుబాయ్ లో ఇప్పటికే సన్నివేశాలు కూడా తీశారు. యాక్షన్ ఎపిసోడ్ తర్వాత మరికొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారు.

 మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

Also Read ప్లానింగ్ లో ముందున్న మహేష్ , అల్లు అర్జున్