మహేష్ బాబును ఇంప్రెస్ చేసిన సినిమా

Tuesday,October 02,2018 - 05:36 by Z_CLU

మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ‘నవాబ్’ రిలీజైన రోజు నుండే సూపర్ హిట్ టాక్ దక్కించుకుంది. క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో మణిరత్నం మార్క్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు మహేష్ బాబు కు కూడా నచ్చేసింది. రీసెంట్ గా ఈ సినిమా చూసిన మహేష్ బాబు, సినిమా అదిరిపోయిందని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైబ్రేషన్స్ క్రియేట్ అవుతున్నాయి.

బేసిగ్గా మణిరత్నం ఫ్యాన్ అయిన మహేష్ బాబు ఈ సినిమా గురించి చెప్తూ… “గతంలో చెన్నై లో ఆయన సినిమాలు చూసేవాణ్ణి. ఇప్పుడు కూడా అంతే గర్వంగా ఈ సినిమాను చూశాను” అని ఈ సినిమా కోసం పని చేసిన A.R. రెహమాన్, సంతోష్ శివన్ ని అభినందించాడు కూడా…

కంప్లీట్ లవ్ ఎంటర్ టైనర్ తీసినా, క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చూసినా మణిరత్నం డెఫ్ఫినేట్ గా సమ్ థింగ్ స్పెషలే… అయితే మధ్యలో కొన్ని ఫ్లాపులతో తడబడ్డా, ఈ నవాబ్ తో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చేశాడు మణిరత్నం.