ఈ లెక్కన చూస్తే ‘భరత్ అనే నేను’ బ్లాక్ బస్టరే!!

Tuesday,April 10,2018 - 12:06 by Z_CLU

ఈ నెల 20 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది మహేష్ బాబు భరత్ అనే నేను. కానీ ఈ లోపే మహేష్ బాబు తన తన ఎగ్జైట్ మెంట్ ని టీమ్ తో సెలెబ్రేట్ చేసుకుంటున్నాడు. ఈ సినిమాకు పని చేసిన టీమ్ కి ఏకంగా ఐ ఫోన్స్ గిఫ్ట్ చేశాడు సూపర్ స్టార్. ఇప్పటి వరకు తను పనిచేసిన టీమ్ లో ది బెస్ట్ టీమ్ అని కాంప్లిమెంట్ కూడా ఇచ్చాడు. మహేష్ బాబు ఈ రేంజ్ లో కాన్ఫిడెంట్ గా ఉండటం, టాలీవుడ్ లో ఈ సినిమా చుట్టూ మరిన్ని పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తుంది.

ఇప్పటికే రిలీజైన ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఏ మాత్రం స్టోరీలైన్ రివీల్ కాకుండానే, సినిమాలో మహేష్ బాబును డిఫెరెంట్ మ్యానరిజంతో, టఫ్ఫెస్ట్ చీఫ్ మినిస్టర్ లా ప్రెజెంట్ చేస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ అయి ఉన్నాయి. దానికి తోడు మహేష్ బాబుతో సహా, ఈ సినిమా టీమ్ లో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూస్తుంటే, సినిమా బ్లాక్ బస్టర్ గ్యారంటీ అనిపిస్తుంది.

 

 

దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాని D.V.V. దానయ్య, D.V.V. సినిమాస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.