మహేష్ బాబు సినిమా ఫస్ట్ లుక్

Friday,February 03,2017 - 12:07 by Z_CLU

మహేష్ బాబు, మురుగదాస్ కాంబినేషన్ సెట్స్ పైకి వచ్చిందో లేదో సూపర్ స్టార్ ఒక్కసారిగా షూటింగ్ మోడ్ లోకి వెళ్ళిపోయాడు. సినిమాకి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్ లాంటివి తప్ప ఇంకే అప్ డేట్ బయటికి రాకపోయేసరికి ఫ్యాన్స్ లో క్యూరాసిటీ టన్నుల కొద్దీ క్రియేట్ అయి ఉంది.

ఫిలిం మేకింగ్ పై తప్ప ఇంకే విషయాలపై కాన్సంట్రేషన్ చేయని సినిమా యూనిట్ ఈ ఉగాదికి ఈ సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారనే టాక్ ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది. ఇలాంటి టాక్ ఈ సినిమా విషయంలో ఫస్ట్ టైం కాకపోయినా, ఈ రూమరేదో రియాల్టీ లోకి ఫాం అయితే బావుంటుందని ఫ్యాన్స్ ఫీలింగ్.

mahesh-babu-ar-murugadoss-film-updates

ప్రస్తుతం హైదరాబాద్ లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించే పనిలో ఉన్న సినిమా యూనిట్, ఈ షెడ్యూల్ కి ప్యాకప్ చెప్పీ చెప్పగానే ముంబయి లో నెక్స్ట్ షెడ్యూల్ బిగిన్ చేసేస్తారు. ఆ తరవాత ఆస్ట్రేలియాలో తక్కిన షూటింగ్ ప్లాన్ చేస్తున్న సినిమా యూనిట్, వీలైతే జూన్ లో ఈ సినిమా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట.