మహేష్ ఫిలిం ఫెస్టివల్.... అతి త్వరలో...

Monday,September 19,2016 - 12:00 by Z_CLU

అప్పుడెప్పుడో ఓ ప్రామిస్ చేశాడు మహేష్. నిజానికి ఆ ప్రామిస్ ను మహేష్ కూడా మరిచిపోయి ఉంటాడు. మళ్లీ ఇన్నాళ్లకు ఇచ్చిన మాట మహేష్ కు గుర్తొచ్చినట్టుంది. అందుకే మాటను నిలబెట్టుకునేందుకు ఓ మాస్టర్ ప్లాన్ రెడీచేశాడు. వచ్చే ఏడాది మొత్తం తన సినిమాలతో అభిమానులకు ఫిలింఫెస్టివల్ అందించాలని ఫిక్స్ అయ్యాడు. దీనికి సంబంధించి యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధమౌతోంది.

ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు మహేష్. ఈ మూవీని వచ్చే ఏడాది సమ్మర్ ఎట్రాక్షన్ గా విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఈ సినిమా సెట్స్ పై ఉంటుండగానే కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమా ప్లాన్ చేశాడు ప్రిన్స్. తమ కాంబినేష్ లో రెండో సినిమా జనవరి నుంచి సెట్స్ పైకి వస్తుందని కొరటాల ఇప్పటికే ఎనౌన్స్ చేశాడు. ఈ సినిమా అటుఇటుగా వచ్చే ఏడాది దసరాకు విడుదలయ్యే అవకాశాలున్నాయి.

mahesh-koratala

     మురుగదాస్, కొరటాల సినిమాల తర్వాత పూరి జగన్నాధ్ దర్శకత్వంలో కూడా మహేష్ నటించే అవకాశం ఉంది. ఈ సినిమా కూడా వచ్చే ఏడాదిలోనే ప్రారంభం అవుతుంది. మహేష్ తో బిజినెస్ మేన్ ను కేవలం 45 రోజుల్లో పూర్తిచేసిన పూరి… ఈ సినిమాను కూడా రికార్డు స్థాయిలో పూర్తిచేస్తే… ఇది కూడా వచ్చే ఏడాదిలోనే విడుదలవ్వడం ఖాయం. సో… ఇప్పటివరకు అనుకున్న ఈక్వేషన్స్ అన్నీ వర్కవుట్ అయితే… వచ్చే ఏడాది మహేష్ నుంచి ముచ్చటగా మూడు సినిమాలు థియేటర్లలో సందడి చేయడం గ్యారెంటీ.

8161-jana-gana-mana-first-look