దూకుడు VS సరిలేరు నీకెవ్వరు...

Saturday,June 01,2019 - 11:02 by Z_CLU

పోలీస్ బ్యాక్ డ్రాప్ లో సినిమా అంటే పక్కా యాక్షన్ ఎంటర్ టైనరే… కానీ మహేష్ బాబు ‘దూకుడు’ ఆ రూల్ ని బ్రేక్ చేసింది. ఇప్పుడు ‘సరిలేరు నీకెవ్వరు’ కూడా అదే చేయబోతుంది. సినిమాలో మహేష్ బాబు ప్లే చేయబోతున్న క్యారెక్టర్ ఆర్మీ మేజర్… కానీ సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్.

అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సినిమా అనౌన్స్ అయినపుడే ‘దూకుడు’ లాంటి సినిమా అని క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. మహేష్ బాబు కూడా వరస సీరియస్ సినిమాల మధ్య ఓ కామెడీ ఎంటర్ టైనర్ పడాల్సిందే అని ఫిక్సయి అనిల్ రావిపూడికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాడు. అందుకే ఈ కొత్త సినిమాతో పాటు ఇప్పుడు ‘దూకుడు’ లైమ్ లైట్ లోకి వచ్చింది.

‘దూకుడు’ సినిమాలో అటు యాక్షన్ ఎలిమెంట్స్ కి, ఇటు ఫ్యామిలీ ఎమోషన్స్ కి సింక్ కుదరడం.. దానికి తోడు చిన్నగా ఫాదర్ సెంటిమెంట్ కూడా కలిసి రావడంతో, ప్రతి జెనెరేషన్ కి కనెక్ట్ అయింది. ఇప్పుడు దానికి మించిన ఫార్ములానేదో ప్లాన్ చేసుకున్నాడు అనిల్ రావిపూడి.

చూడాలి మరీ… మహేష్ బాబును ఫన్ యాంగిల్ లో చూసి చాలా రోజులైంది కాబట్టి ఫ్యాన్స్ కాన్సంట్రేషన్ కూడా ఈ సినిమాపై గట్టిగానే ఉంది. సినిమా సెట్స్ పైకి రాకముందే ‘దూకుడు’ కు మించి ఉంటుందనిపిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు..’ ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో…