మార్చి 6 న ‘భరత్ అనే నేను’ మూవీ టీజర్

Wednesday,February 28,2018 - 07:02 by Z_CLU

మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ మూవీ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్సయింది. మార్చి 6 న ‘ద విజన్ ఆఫ్ భరత్’ అనే పేరిట ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేయనుంది సినిమా యూనిట్. రీసెంట్ గా రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ ఓత్ తో ఎట్రాక్ట్ చేసిన మూవీ మేకర్స్, ఇప్పుడీ టీజర్ ని రిలీజ్ చేయనున్నారు.

కొరటాల మార్క్ కాంటెపరరీ మెసేజ్ తో పాటు ఇమోషనల్ పొలిటికల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు చీఫ్ మినిస్టర్ గా కనిపించనున్నాడు. కైరా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

 

ఏప్రియల్ 20 న గ్రాండ్ గా రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమాకి DSP మ్యూజిక్ కంపోజర్. D.V.V. దానయ్య ఈ సినిమాకి ప్రొడ్యూసర్.