మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ ‘ఫస్ట్ ఓత్’

Friday,January 26,2018 - 08:14 by Z_CLU

కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘భరత్ అనే నేను’ మూవీ ఫస్ట్ ఓత్ రిలీజ్ అయింది. సినిమాలో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ఆడియో క్లిప్ ను ఫేస్ బుక్ ద్వారా విడుదల చేశారు. ఇప్పుడీ ఆడియో రిపబ్లిక్ డే రోజున మహేష్ బాబు అభిమానులకు పర్ఫెక్ట్ గిఫ్ట్ అనిపించుకుంటుంది.

సినిమాలో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నాడనే విషయంపై ఈ ఆడియో క్లిప్ ద్వారా క్లారిటీ వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు ముందు జరిగిన రాజకీయా పరిణామాలకు ఫిక్షన్ జోడించి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు కొరటాల ప్రకటించాడు. ఫస్ట్ ఓథ్ తో పాటు సినిమా టైటిల్ డిజైన్ ను కూడా రిలీజ్ చేశారు.

మహేష్ బాబు సరసన కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని D.V.V. దానయ్య నిర్మిస్తున్నాడు. రాక్ స్టార్ DSP మ్యూజిక్ కంపోజర్.