100 కోట్లు వసూలు చేసిన భరత్ అనే నేను

Sunday,April 22,2018 - 01:56 by Z_CLU

మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ రిలీజైన ప్రతి సెంటర్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. మహేష్ బాబును CM లా ప్రెజెంట్ చేసిన ఈ పొలిటికల్ కమర్షియల్ ఎటర్ టైనర్ జస్ట్ తెలుగు స్టేట్స్ లో కేవలం 2 రోజుల్లో 100 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక అమెరికాలో ఇప్పటికే 2 మిలియన్ డాలర్స్ వసూలు చేసి సరికొత్త రికార్డ్స్ మేకింగ్ స్పీడ్ లో ఉంది భరత్ అనే నేను.

రిలీజ్ కి ముందు క్రియేట్ అయిన హైప్ కి ధీటుగా ఉందనిపించుకున్న ఈ సినిమా పర్టికులర్ క్యాటగిరీ అని కాకుండా ఓవరాల్ గా అందరినీ మెస్మరైజ్ చేస్తుంది. రిలీజైన 3 వ రోజు కూడా అంతే స్ట్రాంగ్ గా ప్రదర్శించబడుతున్న  ‘భరత్ అనే నేను’ వీకెండ్ కావడంతో 3 రోజు కలెక్షన్స్ కూడా మరిన్ని రికార్డ్స్ బ్రేక్ చేయడం గ్యారంటీ అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.

కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో మహష్ బాబు సరసన కైరా అద్వానీ నటించింది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజర్. D.V.V. దానయ్య ఈ సినిమాకి ప్రొడ్యూసర్.