మహేష్ బాబు చేజింగ్ బిగిన్ అయింది

Thursday,March 23,2017 - 03:23 by Z_CLU

ఈ రోజే వియత్నాం బయలుదేరుతున్నాడు మహేష్ బాబు. అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న AR మురుగదాస్, మహేష్ బాబు సినిమా యూనిట్  ప్రస్తుతం సినిమాకే హైలెట్ కాబోయే చేజింగ్ సీన్ కోసం ప్రిపేర్ అవుతుంది. వియత్నాం లోని హోచో మిన్హ్, హానోయ్ సిటీస్ లో చేజింగ్ సీన్స్ ప్లాన్ చేసిన మురుగదాస్ సినిమా ఈ షెడ్యూల్ కి ప్యాకప్ చెప్తే మ్యాగ్జిమం టాకీ పార్ట్ పూర్తయినట్టే.

ఇప్పటికే ముంబై, అహ్మదాబాద్, వడోదర, చెన్నై, హైదరాబాద్ లాంటి ప్రదేశాల్లో షూటింగ్ జరుపుకున్న సినిమా యూనిట్, వియత్నాం నుండి తిరిగి రాగానే బ్యాలన్స్ ఉన్న రెండు పాటలను కంప్లీట్ చేసుకునే ఆలోచనలో ఉంది. ఈ సినిమాలో మహేష్ బాబు రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

 

ఠాగూర్ మధు, NV ప్రసాద్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 23 న రిలీజ్ కానుంది. ఇప్పటి వరకు సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్, టైటిల్ లాంటివేవీ అనౌన్స్ చేయకుండా హై ఎండ్ సస్పెన్స్ మెయిన్ టైన్ చేస్తున్న సినిమా యూనిట్ ఈ ఉగాదికేమైనా సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తుందా అని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్.