షూటింగ్ అప్ డేట్స్

Monday,November 06,2017 - 05:27 by Z_CLU

మన ఫేవరేట్ స్టార్స్ సినిమాలు ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటున్నాయి. కొన్ని హై ఇంటెన్సివ్ ఇమోషన్ సీన్స్ ని తెరకెక్కించే ప్రాసెస్ లో ఉంటే, మరొకొన్ని హై ఎండ్ యాక్షన్ సీక్వెన్సెస్ తెరకెక్కించే పనిలో ఉన్నాయి. అల్టిమేట్ గా ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమాల డీటేల్స్ ఇవే…

మహేష్ బాబు- భరత్ అనే నేను : కొరటాల శివ డైరెక్షన్ లో  ‘భరత్ అనే నేను’ మూవీ షూటింగ్ కొన్ని రోజులుగా అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతుంది. ఈ సినిమా కోసం స్పెషల్ గా వేసిన CM చాంబర్ సెట్ లో షూటింగ్ జరుపుకున్న సినిమా యూనిట్, ఈ షెడ్యూల్ కి ఇవాళ్టితో సక్సెస్ ఫుల్ గా ప్యాకప్ చెప్పేసింది.

 

పవన్ కళ్యాణ్ – అజ్ఞాతవాసి : పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ మూవీ ప్రస్తుతం బల్గేరియాలో కీలక సన్నివేశాలను తెరకెక్కించే ప్రాసెస్ లో ఉంది. ఏ మాత్రం గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ తో బిజీగా ఉన్న సినిమా యూనిట్, ఈ షెడ్యూల్ తరవాత ఇమ్మీడియట్ గా లండన్ లో షూటింగ్ బిగిన్ చేయనుంది.

బెల్లంకొండ శ్రీనివాస్ – సాక్ష్యం : బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న ‘సాక్ష్యం’ మూవీ ప్రస్తుతం కర్ణాటకలోని బళ్ళారిలో షూటింగ్ జరుపుకుంటుంది. గత 15 రోజులుగా సినిమాలోని అడ్వెంచరస్ సీక్వెన్సెస్ ని తెరకెక్కించే ప్రాసెస్ లో ఉన్న సినిమా యూనిట్, ఈ షెడ్యూల్ ని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాకు శ్రీవాస్ డైరెక్టర్.

 

కీర్తి సురేష్మహానటి : మహానటి సావిత్రి సినిమా ఢిల్లీలో గత కొద్ది రోజులుగా షూటింగ్ జరుపుకుంటుంది. నిన్నటితో ఈ షెడ్యూల్ కి సక్సెస్ ఫుల్ గా ప్యాకప్ చెప్పేసిన సినిమా యూనిట్, త్వరలో నెక్స్ట్ షెడ్యూల్ ని బిగిన్ చేయనుంది.

అల్లు శిరీష్ – V.I. ఆనంద్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న అల్లు శిరీష్ సినిమా ప్రస్తుతం బెంగళూరులో షూటింగ్ జరుపుకుంటుంది. సురభి, సీరత్ కపూర్  హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా  షెడ్యూల్ మరో 20 రోజులు ఉంటుంది.