జీ తెలుగులో మెరిసిన మహేష్ బాబు, సితార

Tuesday,August 30,2022 - 08:00 by Z_CLU

Mahesh Babu along with Sitara Ghattamaneni attends Zee Telugu’s ‘Dance India Dance Telugu’ Show

 సూపర్ స్టార్ మహేష్ బాబు, ఘట్టమనేని సితార కలిసి జీ తెలుగు షో లో మెరిశారు. ఇటివలే జీ తెలుగులో ‘డాన్స్ ఇండియా డాన్స్ తెలుగు’ అనే డాన్సింగ్ షో ప్రారంభమైంది. ఈ షో కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. అందుకే ఈ షోకి తన కూతురు సితారతో కలిసి స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు. సూపర్ స్టార్ మహేశ్. మహేష్, సితార ఎంట్రీ విజువల్స్ అదిరిపోయాయి. అలాగే షోలో సితార డాన్స్ పెర్ఫార్మెన్స్ చేస్తుండగా మహేష్ చూస్తూ ఎంజాయ్ చేయడం ఎట్రాక్ట్ చేసింది.

షోలో పార్టిసిపెంట్ చేస్తున్న బాబు, కుమార్ టెర్రిఫిక్ పెర్ఫార్మెన్స్ కి మహేష్ మెస్మరైజ్ అయిపోయారు. వారికి తను తీయబోయే సినిమాల్లో కానీ చేస్తున్న సినిమాల్లో కానీ తప్పకుండా అవకాశం ఇస్తానని మాటిచ్చారు సూపర్ స్టార్.

ప్రస్తుతం మహేష్ సితార ఎటెండయిన ఈ ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మహేష్ ఈ షోకి కూతురితో రావడంతో ఈ ఎపిసోడ్ కోసం ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ ఆదివారం రాత్రి 9గంటలకు ఈ స్పెషల్ ఎపిసోడ్ జీ తెలుగులో టెలికాస్ట్ అవ్వనుంది.

ఇక మహేష్ కి జీ సంస్థకి ఎప్పటి నుండో మంచి అనుబంధం ఉంది. గతంలో జీ టాక్ షోస్, అలాగే సీరియల్ ప్రమోషన్స్ లో మహేష్ కనిపించిన సంగతి తెలిసిందే. ఆ రిలేషన్ షిప్ తోనే మహేశ్ మరోసారి ఇలా షో కి స్పెషల్ గెస్ట్ గా విచ్చేసి పార్టిసిపెంట్ చేసే టాలెంటర్స్ ని సపోర్ట్ చేస్తూ వారి పెర్ఫార్మెన్స్ ఎంజాయ్ చేశారు.

 

డాన్స్ ఇండియా డాన్స్ తెలుగు …ఈ ఆదివారం రాత్రి 9గం..లకు DONT MISS

 

*Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics