స్ట్రాంగ్ మెసేజ్ తో వస్తున్న మహేష్

Thursday,March 07,2019 - 01:40 by Z_CLU

మళ్ళీ ఓ స్ట్రాంగ్ మెసేజ్ తో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు మహేష్. అవును ‘మహర్షి’ సినిమాలో ఓ స్ట్రాంగ్ మెసేజ్ఉంది. ప్రస్తుతానికైతే ఈ విషయంపై యూనిట్ నుండి ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు… కానీ సినిమాలో రైతుల గురించి మంచి సందేశం ఉండబోతుందట. ముఖ్యంగా సెకండ్ హాఫ్ చాలా ఎమోషనల్ గా ఉంటుందని తెలుస్తోంది.  రెండేళ్ళ పాటు రెడీ చేసుకున్న కథను అదిరిపోయే క్లైమాక్స్ తో ముగించాడట వంశీ పైడిపల్లి.  క్లైమాక్స్ కాన్సెప్ట్ ను ఓ రేంజ్ లో ఎలివేట్ చేస్తుందని అంటున్నారు.

ఇటివలే దిల్ రాజు కూడా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు.  సినిమా చూసాక థియేటర్ బయటికి ఒక ఫీల్ వస్తారని.. ఇది కరెక్ట్ కదా .. మన వంతుగా మనమేం చేస్తున్నామనే ఆలోచన అందరిలో కలుగుతుందని చెప్పుకొచ్చాడు. ఆ మధ్య  ‘శ్రీమంతుడు’తో కూడా ఓ స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చాడు మహేష్. అప్పటి వరకూ ఎవరూ టచ్ చేయని ‘గ్రామాల దత్తతు’ కాన్సెప్ట్ తో అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా చేసాడు.  ఆ సినిమాతో మహేష్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.

‘భరత్ అనే నేను’ కూడా ఇంతే .. ఇప్పుడున్న పరిస్థితుల్లో యువత రాజకీయాల్లోకి వస్తే సమాజంలో చాలా మార్పు వస్తుందనే మెసేజ్ ఇచ్చాడు. అది మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.  ఇప్పుడు మహర్షి కూడా మహేష్ కి అదే రేంజ్ హిట్ ఇస్తుందా..? మహర్షి కాన్సెప్ట్ అందరినీ ఆలోచింపజేస్తుందా..? చూడాలి.