రిపీట్ అంటున్న Mahesh Babu

Tuesday,February 02,2021 - 06:14 by Z_CLU

గతేడాది జనవరిలో  ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో సంక్రాంతి రేస్ లో నిలిచి భారీ కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న సూపర్ స్టార్ మహేష్ మళ్ళీ  ఆ మేజిక్ ని రిపీట్ చేయబోతున్నాడు. అవును పరశురాం బుజ్జి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘సర్కారు వారి పాట‘ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కి రిలీజ్ కానుంది. ఇటివలే సెట్స్ పైకి వెళ్ళిన ఈ సినిమాను వచ్చే సంక్రాంతి రేస్ లో నిలిపాడు మహేష్.

నిజానికి ఏడాది ముందే ఇలా సంక్రాంతి సీజన్ ను లాక్ చేసుకొని ఏడాది పాటు ఈ సినిమా గురించి కష్టపడనున్నట్లు చెప్పకనే చెప్పాడు సూపర్ స్టార్. సినిమాలో చాలా పార్ట్ విదేశాల్లో ఉండటంతో షూటింగ్  కి చాలా టైం తీసుకోనున్నాడు పరశురాం. అన్నీ అలోచించిన తర్వాత ఇలా సంక్రాంతి రిలీజ్ అంటూ ప్రకటించారు. ఇప్పటికే ప్రీ లుక్ పోస్టర్స్ , థీం సాంగ్ తో హైప్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమాతో సూపర్ స్టార్ వచ్చే పొంగల్ కి  ఎలాంటి విజయం అందుకుంటాడో చూడాలి.