సుకుమార్ డైరెక్షన్ లో మహేష్ బాబు – అఫీషియల్

Sunday,April 22,2018 - 02:49 by Z_CLU

సుకుమార్ డైరెక్షన్ లో మరో సినిమాకు సంతకం పెట్టాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ విషయాన్ని రీసెంట్ గా ఇచ్చిన ‘జీ సినిమాలు’ ఇంటర్వ్యూలో కన్ఫం చేశాడు సుకుమార్. అయితే ఇప్పుడీ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మైత్రి మూవీ మేకర్స్. ‘శ్రీమంతుడు’ తరవాత ఈ బ్యానర్ పై మహేష్ బాబుకు ఇది సెకండ్ మూవీ.

త్వరలో వంశీ పైడిపల్లి తో తన 25 వ సినిమాతో సెట్స్ పైకి రానున్న మహేష్ బాబు, ఈ సినిమాకి ప్యాకప్ చెప్పీ చెప్పగానే సుకుమార్ తో సెట్స్ పై ఉంటాడు. ప్రస్తుతం U.S. వెకేషన్ లో ఉన్న సుకుమార్, ఈ ట్రిప్ నుండి రాగానే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ ని బిగిన్ చేస్తాడు. గతంలో ‘వన్ – నేనొక్కడినే’ సినిమా తరవాత  సుకుమార్ తో సెట్స్ పైకి వస్తున్న మహేష్ బాబు మరో డిఫెరెంట్ ఎంటర్ టైనర్ తో చేయడం గ్యారంటీ అని ఫిక్సయిపోయారు ఫ్యాన్స్.

నవీన్, రవి శంకర్, CV మోహన్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమా మ్యాగ్జిమం ఈ ఇయర్ లోనే సెట్స్ పైకి తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నారు ఫిలిం మేకర్స్. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రధాన టెక్నీషియన్స్ తో పాటు, తక్కిన స్టార్ కాస్ట్ ని లిస్ట్ చేసే ప్రాసెస్ లో ఉంది సుకుమార్ టీమ్.