సీఐడీ ఆఫీసర్ గా మహేష్ బాబు

Monday,May 28,2018 - 06:42 by Z_CLU

ప్రస్తుతం ఫిలింనగర్ లో హాట్ గాసిప్ ఇదే. త్వరలోనే సీఐడీ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడట సూపర్ స్టార్. ఇప్పటివరకు ఎవరూ చేయని డిఫరెంట్ క్యారెక్టర్ ఇదట. సుకుమార్-మహేష్ సినిమాకు సంబంధించిన మేటర్ ఇది.

సుకుమార్, మహేష్ మధ్య ఇప్పటికే స్టోరీ డిస్కషన్లు పూర్తయిన విషయం తెలిసిందే. సుక్కూ చెప్పిన 2-3 క్యారెక్టరైజేషన్ల నుంచి ఒక క్యారెక్టర్ కు మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఆ క్యారెక్టర్ సీఐడీ ఆఫీసర్ అని టాక్. కంప్లీట్ క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో సినిమా రాబోతోందట.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయింది. స్క్రీన్ ప్లే రాసే పనిలో సుకుమార్ అండ్ టీం బిజీ అయింది. వంశీ పైడిపల్లితో సినిమా స్టార్ట్ అయి, ఓ షెడ్యూల్ కంప్లీట్ అయిన వెంటనే.. మహేష్-సుక్కూ సినిమా పట్టాలపైకి వస్తుందట.