మహేష్ మెచ్చిన పేపర్ బాయ్

Thursday,August 23,2018 - 03:13 by Z_CLU

సంతోష్ శోభన్, రియా సుమన్ జంటగా నటించిన సినిమా పేపర్ బాయ్. కంప్లీట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ట్రయిలర్ రీసెంట్ గా రిలీజైంది. ఈ ట్రయిలర్ మహేష్ బాబుకు బాగా నచ్చింది. అదే విషయాన్ని ట్విట్టర్ లో పెట్టాడు సూపర్ స్టార్.

“పేపర్ బాయ్ ట్రయిలర్ చూశాను. చాలా ఫ్రెష్ గా, ప్లెజెంట్ గా ఉంది. వ్యక్తిగతంగా నా మనసుకు బాగా నచ్చింది. గతంలో శోభన్ గారి దర్శకత్వంలో నటించాను. ఇప్పుడు వాళ్ల అబ్బాయి సంతోష్ శోభన్ ను చూస్తున్నాను. సంతోష్ తో పాటు టీమ్ మొత్తానికి బెస్ట్ విశెష్.”

ఇలా ట్విట్టర్ లో తన ఆనందాన్ని వ్యక్తంచేశాడు మహేష్. సంపత్ నంది టీమ్ వర్క్స్ బ్యానర్ పై సంపత్ నంది నిర్మాతగా జయశంకర్ డైరక్ట్ చేసిన ఈ సినిమాకు భీమ్స్ సంగీతం అందించాడు. ఈనెల 31న థియేటర్లలోకి రానున్నాడు పేపర్ బాయ్.