మహేష్, అనీల్ రావిపూడి మూవీ అప్ డేట్స్

Monday,March 18,2019 - 01:24 by Z_CLU

ప్రస్తుతం మహర్షి సినిమాతో బిజీగా ఉన్న మహేష్, త్వరలోనే అనీల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. దిల్ రాజు, అనీల్ సుంకర సంయుక్తంగా ఈ మూవీని ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి తాజాగా మరో అప్ డేట్ వచ్చింది. అదేంటంటే.. ఈ హిలేరియస్ ఎంటర్ టైనర్ కు సంబంధించి అనీల్ రావిపూడి స్క్రిప్ట్ వర్క్ పూర్తిచేశాడట.

అన్నీ అనుకున్నట్టు జరిగితే జులై నుంచి మహేష్-అనీల్ రావిపూడి సినిమా సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ ఉంది. ఈ సినిమాలో విజయశాంతి, ఉపేంద్ర లాంటి సీనియర్ యాక్టర్స్ కోసం ట్రై చేస్తున్నారంటూ ఇప్పటికే ప్రచారం సాగుతోంది. దర్శకుడు తనను కలిసినట్టు ఉపేంద్ర ఇప్పటికే కన్ ఫర్మ్ చేయగా, విజయశాంతి మాత్రం రియాక్ట్ అవ్వలేదు.

మరోవైపు హీరోయిన్ ఎవరనే అంశంపై కూడా చాలా పేర్లు వినిపిస్తున్నప్పటికీ, రష్మికను ఫైనల్ చేసినట్టు టాక్. యాక్షన్, కామెడీ మిక్స్ తో ఈ సినిమా రాబోతోంది