సమ్మర్ కి సంక్రాంతి హీరోల పోటీ?

Thursday,June 18,2020 - 05:02 by Z_CLU

కరోనా ఎఫెక్ట్ తో టాలీవుడ్ లో చాలా మార్పులు జరిగాయి. సెట్స్ పై ఉన్న సినిమాలతో పాటు స్టార్ట్అ అవ్వాల్సిన  సినిమాలు కూడా ఎప్పుడు రిలీజ్ అవుతాయనేది తెలియని పరిస్థితి. అయితే కొందరు స్టార్ హీరోల సినిమాలు మాత్రం వచ్చే ఏడాది సమ్మర్ కి ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాటిలో మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ తో పాటు అల్లు అర్జున్ ‘పుష్ప’ ఉన్నట్లు సమాచారం.

వీరిద్దరూ ఈ ఏడాది సంక్రాంతి పోటీలో నిలిచి భారీ విజయాలు అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి సమ్మర్ బరిలో పోటీ పడబోతునట్లు తెలుస్తుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే బన్నీ ‘పుష్ప’ షూటింగ్ ఈ పాటికే సగం పూర్తయ్యేది. అలాగే మహేష్ సినిమా కూడా సెట్స్ పైకి వెళ్ళేది. కానీ లాక్ డౌన్ కారణంగా బన్నీ మూవీ షూటింగ్ వాయిదా పడింది. మహేష్ సినిమాను అఫీషియల్ గా ఎనౌన్స్ చేసినప్పటికీ సెట్స్ పైకి వెళ్ళే అవకాశం కనిపించడం లేదు.

ఈ నేపథ్యంలో ఈ రెండు సినిమాలు ఒకే సారి షూటింగ్ మొదలు పెట్టే అవకాశం ఉంది. అందువల్ల రెండు సినిమాలు సమ్మర్ లో విడుదలయ్యేలా ప్లానింగ్ జరుగుతుందని తెలుస్తుంది. ఆ ప్లానింగ్ ప్రకారం ఇంకో 2-3 నెలల్లో మహేష్ , బన్నీ సినిమాల షూటింగ్ మొదలైతే వచ్చే ఏడాది సమ్మర్ కి థియేటర్స్ లో ఒకేసారి ఎంట్రీ ఇవ్వడం మాత్రం ఖాయం.