గొడ్డలి పట్టిన మహేష్.. సరిలేరు నీకెవ్వరు

Monday,October 07,2019 - 06:42 by Z_CLU

సరిలేరు నీకెవ్వరు సినిమా నుంచి మహేష్ బాబు స్టిల్స్ రావడం ఇదే ఫస్ట్ టైమ్ కాదు. ఇప్పటికే కొన్ని స్టిల్స్ బయటకొచ్చాయి. అయితే అవన్నీ ఒకెత్తు, దసరా సందర్భంగా విడుదలచేసిన బ్రాండ్ న్యూ పోస్టర్ మరో ఎత్తు. అవును.. సినిమాపై అంచనాల్ని అమాంతం పెంచేలా మహేష్ యాక్షన్ లుక్ తో రిలీజ్ చేసిన పోస్టర్, ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది.

రీసెంట్ గా వచ్చిన మహర్షి లో అక్కడక్కడ మాస్ లుక్ లో కనిపించాడు మహేష్. సెకెండాఫ్ లో వచ్చిన ఓ ఫైట్ లో కూడా మహేష్ ను ఎగ్రెసివ్ గానే చూపించారు. అంతకంటే ముందొచ్చిన భరత్ అనే నేను సినిమాలో కూడా కత్తిపట్టిన మహేష్ ను చూశాం. కానీ ఈ పోస్టర్ మాత్రం ఎందుకు వాటికంటే ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తోంది.

దీనికి తోడు బ్యాక్ డ్రాప్ లో కొండారెడ్డి బురుజు ఉండడం ఈ పోస్టర్ కు మరింత యాక్షన్ లుక్ తీసుకొచ్చింది. గతంలో ఇదే బ్యాక్ డ్రాప్ లో, ఒక్కడు సినిమాలో మహేష్ చేసిన యాక్షన్ సీన్ ఇప్పటికీ అందరికీ గుర్తే. దానికి ఏమాత్రం తీసిపోని విధంగా ఈ సీన్ ఉంటుందని ఊరిస్తున్నాడు దర్శకుడు అనీల్ రావిపూడి. సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రాబోతోంది ఈ సినిమా.